పంచాయతీ: దమ్ముంటే పోలీసులు లేకుండా గెలవండి.. వైసీపీ నేతలకు కోట్ల సవాల్

Siva Kodati |  
Published : Feb 18, 2021, 09:38 PM ISTUpdated : Feb 18, 2021, 09:39 PM IST
పంచాయతీ: దమ్ముంటే పోలీసులు లేకుండా గెలవండి.. వైసీపీ నేతలకు కోట్ల సవాల్

సారాంశం

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గెలిపించకుంటే పథకాలు తీసేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గెలిపించకుంటే పథకాలు తీసేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

మంత్రులకు దమ్ముంటే పెండింగ్ ప్రాజెక్ట్‌లకు నిధులు విడుదల చేయాలని కోట్ల సవాల్ విసిరారు. అలాగే పోలీసులను పక్కనపెట్టి పోటీ చేయాలని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని కోట్ల అన్నారు. టీడీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని చెప్పారు. ప్రజలు బాగుండటమే తమకు కావాలని సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు.

ప్రజాసేవే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. పేకాట, బెట్టింగులను ప్రోత్సహిస్తున్న వైసీపీ నేతలను అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు ఉందా? అని కోట్ల ప్రశ్నించారు

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!