కొత్తగా 67 మందికి పాజిటివ్... చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,89,077కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Feb 18, 2021, 07:39 PM IST
కొత్తగా 67 మందికి పాజిటివ్... చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,89,077కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,89,077కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 67 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,89,077కి చేరింది.

కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు విశాఖలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలిపి రాష్ట్రంలో వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,166కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 619 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 54 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,81,292కి చేరింది. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో 28,239 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేశారు.

వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా టెస్టుల సంఖ్య 1,36,44,086కి చేరుకుంది. గత 24 గంటల్లో అనంతపుపర 2, చిత్తూరు 17, తూర్పుగోదావరి 10, గుంటూరు 12, కడప 4, కృష్ణ 3, కర్నూలు 0, నెల్లూరు 4, ప్రకాశం 2, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 10, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 2 కేసులు చొప్పున నమోదయ్యాయి.
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu