దాడికి వారం ముందు నుండే ప్లాన్.. బోడెప్రసాద్ పై కూడా.. : పట్టాభి సతీమణి

Published : Feb 02, 2021, 02:19 PM IST
దాడికి వారం ముందు నుండే ప్లాన్.. బోడెప్రసాద్ పై కూడా.. : పట్టాభి సతీమణి

సారాంశం

తనపై దాడి జరిగే అవకాశం ఉందని పట్టాభి వారం రోజుల క్రితమే చెప్పారని ఆయన భార్య అంటున్నారు. విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కారుపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడి చేసిన సంగతి తెలిసిందే. 

పట్టాభిపై దాడిపట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికలు జరగున్న తరుణంలో ఏపీలో రోజుకో ఘటన వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే పట్టాభిపై దాడి జరిగింది. విషయం తెలిసిన వెంటనే పలువురు నేతలు పట్టాభిని పరామర్శించారు.

విజయవాడలో ఉద్రిక్తత... టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిపై రాళ్ల దాడి (వీడియో)..

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పట్టాభిని స్వయంగా పరామర్శించనున్నారు. ఈ క్రమంలో పట్టాభి సతీమణి వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఆమె మాట్లాడుతూ తనపై దాడి చేయడానికి వారం రోజుల నుంచి ఫ్లాన్ జరుగుతోందని, జాగ్రత్తగా ఉండాలని పట్టాభి ముందే చెప్పారన్నారు. 

ఆయనతో పాటు టీడీపీ నేత బోడె ప్రసాద్ పై కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని ఆయన చెప్పారని అన్నారు. జాగ్రత్తగా ఉండాలని, దాడి జరగకుండా రక్షణ తీసుకోవాలని చెప్పారని ఆమె తెలిపారు. 

ప్రతి రోజు పట్టాభి వెంట ఇద్దరు ముగ్గురు ఉంటారని, వారు ఈ రోజు రాలేదని ఆమె తెలిపారు. ఇంటినుంచి బైటికి వెళ్లగానే దాడి జరిగిందని ఆమె చెప్పారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ | AP State Food Commission Chairman