తల్లిదండ్రులకు ఇక కనిపించనని.. విజయవాడ కృష్ణానదిలో దూకి తెలంగాణ విద్యార్ధి ఆత్మహత్య

Siva Kodati |  
Published : Jun 01, 2023, 05:11 PM IST
తల్లిదండ్రులకు ఇక కనిపించనని.. విజయవాడ కృష్ణానదిలో దూకి తెలంగాణ విద్యార్ధి ఆత్మహత్య

సారాంశం

విజయవాడ కృష్ణానదిలో దూకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని లోకేష్‌గా గుర్తించారు. 

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో దూకి ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మోతే మండలం మాజీ ఎంపీపీ కుమారుడు లోకేశ్‌గా గుర్తించారు. ఇతను హైదరాబాద్ శివార్లలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 29న తాను ఇక కనిపించని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన లోకేష్ గురువారం కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ప్రేమ వ్యవహారం కారణంగా ఇతను బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు లోకేశ్ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు