అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

By Siva Kodati  |  First Published Aug 20, 2019, 12:45 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమైన ఘటనపై టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి సామాన్లు తరలించేటప్పుడు.. కొంత ఫర్నిచర్‌ను తాను వినియోగించుకున్నట్లు స్పష్టం చేశారు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమైన ఘటనపై టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి సామాన్లు తరలించేటప్పుడు.. కొంత ఫర్నిచర్‌ను తాను వినియోగించుకున్నట్లు స్పష్టం చేశారు.

ఫర్నిచర్ తీసుకువెళ్లాలని అసెంబ్లీ అధికారులకు తాను లేఖ కూడా రాశానని కోడెల గుర్తు చేశారు. కానీ శాసనసభ కార్యాలయ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదన్నారు.

Latest Videos

ఇప్పుడైనా అధికారులు వస్తే ఫర్నిచర్ అప్పగిస్తానని... లేకపోతే ఎంత ఖర్చు అయ్యిందో చెబితే చెల్లిస్తానని శివప్రసాద్ తేల్చి చెప్పారు. ఏపీ అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ పోయిందంటూ మంగళవారం ఉదయం వార్తలు రావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. 

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

click me!