తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణకు ప్రభుత్వం సెక్యూరిటీని తొలగించింది. కన్నా లక్ష్మీనారాయణ గన్‌మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుందని టీడీపీ తెలిపింది.
తెలుగుదేశం పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణకు ప్రభుత్వం సెక్యూరిటీని తొలగించింది. కన్నా లక్ష్మీనారాయణ గన్‌మెన్లను ప్రభుత్వం ఉపసంహరించుకుందని టీడీపీ తెలిపింది. అయితే సమాచారం ఇవ్వకుండా గన్‌మెన్‌లను తొలగించడం సరికాదని పేర్కొంది. మంత్రి అంబటి రాంబాబు ఒత్తిడితోనే గన్‌మెన్‌లను తొలగించారని ఆరోపించింది. ఇక, కన్నా లక్ష్మీనారాయణ గన్‌మెన్‌లుగా ఉన్నవారు గత మూడు రోజులుగా విధులకు రావడం లేదని.. ఇందుకు సంబంధించి ఆరాతీస్తే ప్రభుత్వం గన్‌మెన్లను ఉపసంహరించుకున్నట్లు తెలిసిందని చెబుతున్నారు.