ఎన్నికల తర్వాత జగన్ జైలుకే.. అధికారులూ మూల్యం చెల్లించుకోవాల్సిందే : కన్నా లక్ష్మీనారాయణ

Siva Kodati |  
Published : Sep 09, 2023, 02:57 PM IST
ఎన్నికల తర్వాత జగన్ జైలుకే.. అధికారులూ మూల్యం చెల్లించుకోవాల్సిందే : కన్నా లక్ష్మీనారాయణ

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండించారు ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణ.  వచ్చే ఎన్నికల తర్వాత జగన్ జైలుకెళ్లడం ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఖండించారు ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీ నారాయణ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువగళంతో లోకేష్, ప్రజాబలంతో చంద్రబాబు తన ప్రభుత్వ పునాదులు కదుపుతున్నారన్న భయంతో జగన్ బరితెగించాడని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌పై జగన్ ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శలు చేశారు. ప్రజల కోసం పనిచేయాల్సిన సీబీసీఐడీ, సీఐడీ ఇతర సంస్థలు జగన్ కక్ష సాధింపు వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాయని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అర్ధరాత్రి వెళ్లి చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అసవరం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు విషయంలో దర్యాప్తు సంస్థలు పరిధి దాటి వ్యవహరించాయన్నారు. 

విపక్షాలను తప్పుడు కేసులతో దారికి తెచ్చుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని కన్నా ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2 లక్షల మంది యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి లభించిందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ ప్రభుత్వం నివేదిక రూపంలో తెలియజేసిందని ఆయన పేర్కొన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా సైకో ముఖ్యమంత్రికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని కన్నా జోస్యం చెప్పారు. పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ జైలుకెళ్లడం ఖాయమని కన్నా లక్ష్మీనారాయణ జోస్యం చెప్పారు. 

Also Read: చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపే.. ఆయనకు మా మద్దతు ఉంటుంది: పవన్ కల్యాణ్ (వీడియో)

కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాల పట్టణంలోని జ్ఞానాపురంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో హైడ్రామా నెలకొంది. ఆయన అరెస్టు కోసం సీఐడీ అధికారులు రాత్రికి 2.30 గంటలకు ఫంక్షల్ హాల్ వద్దకు చేరుకున్నప్పటికీ.. ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?