చంద్రబాబు కాన్వాయ్‌ కి అడ్డుపడుతున్న టీడీపీ శ్రేణులు.. రోడ్లపై టైర్ల కాల్చివేత.. తీవ్ర ఉద్రిక్తత.

Published : Sep 09, 2023, 02:22 PM ISTUpdated : Sep 09, 2023, 02:32 PM IST
చంద్రబాబు కాన్వాయ్‌ కి అడ్డుపడుతున్న టీడీపీ శ్రేణులు.. రోడ్లపై టైర్ల కాల్చివేత.. తీవ్ర ఉద్రిక్తత.

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నంద్యాల పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నంద్యాల పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను రోడ్డుమార్గంలో నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. చంద్రబాబును ఆయన కాన్వాయ్‌లోనే పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నారు. అయితే చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పలుచోట్ల టీడీపీ శ్రేణులు యత్నించాయి.  అయితే పోలీసులు వారిని  చెదరగొడుతూ ముందుకు సాగుతున్నారు. 

చంద్రబాబు కాన్వాయ్ ఒంగోలుకు చేరుకోగానే మహిళలు, వృద్ధులు సైతం రోడ్డు మీదికి వచ్చి పోలీసులను తోసుకుంటూ కాన్వాయ్‌కు అడ్డు పడ్డారు. మరికొంతమంది కాన్వాయ్ కి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు.

ఇక, అద్దంకి నియోజకవర్గం ముప్పవరం లో టీడీపీ కార్యకర్తల నిరసన తెలియజేశారు. పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు నాయుడు‌ను తరలిస్తున్న కాన్వాయ్‌కు టీడీపీ శ్రేణులు అడ్డుపడ్డారు. అయితే పోలీసుల విచక్షణా రహిత లాఠీ ఛార్జ్ లో ఓ వ్యక్తి కంటికి తీవ్ర గాయం అయింది. చంద్రబాబును తరలిస్తున్న మార్గంలో పలుచోట్ల ఇలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబును విజయవాడకు తరలిస్తున్న కాన్వాయ్‌ను ముందుకు సాగేందుకు సమయం పడుతుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?