ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా..? జేసీ సీరియస్..!

Published : Jul 05, 2021, 01:16 PM IST
ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా..? జేసీ సీరియస్..!

సారాంశం

 వైఎస్ పై విమర్శలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మంత్రులెవరూ స్పందించకపోవడంపై మండిపడ్డారు. వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని  పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం జల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై విమర్శలు చేస్తున్నారు. వైఎస్ పై విమర్శలు చేయడటం పట్ల ఇప్పటికే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. వైఎస్ విమర్శలు చేస్తే జగన్ ఊరుకున్నా.. తాను ఊరుకోనంటూ మండిపడ్డారు.

తాజాగా.. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. వైఎస్ పై విమర్శలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మంత్రులెవరూ స్పందించకపోవడంపై మండిపడ్డారు. వైఎస్ తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అని  పేర్కొన్నారు.


తెలంగాణకు ద్రోహం చేశారని... రాక్షసుడు అని తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనుషిని రాక్షసుడు అంటారా? అని జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద మనిషిని బండ బూతులు తిడుతుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. 

బండ బూతులు తిట్టే ఏపీ మినిస్టర్లు ఇప్పుడు గాజులు తొడుక్కున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాదులో సెటిలర్స్ ఎవరని నిలదీశారు. తమ  పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టారని..  అక్కడే చదువుకున్నారని.. ఇక్కడ ప్రజలు హైదరాబాద్‌కి వెళ్లి షాపింగ్ చేస్తున్నారని జేసీ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu