సీఐ ఫోన్ డేటా డిలీట్ చేశారు: ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్

By narsimha lode  |  First Published Jul 5, 2023, 12:00 PM IST

ఎమ్మెల్యే  పెద్దారెడ్డి  ఒత్తిడితోనే తాడిపత్రి సీఐ ఆనందరావు  ఆత్మహత్య చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి  ఆరోపించారు.



అనంతపురం:ఎమ్మెల్యే పెద్దారెడ్డి  ఒత్తిడితోనే  తాడిపత్రి సీఐ ఆనందరావు  ఆత్మహత్య చేసుకున్నారని   మాజీ ఎమ్మెల్యే , టీడీపీ నేత  జేసీ ప్రభాకర్ రెడ్డి  ఆరోపించారు.బుధవారంనాడు  మాజీ ఎమ్మెల్యే  జేసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో మీడియాతో మాట్లాడారు. ఆనందరావు  మృతి చెందిన విషయం  తెలియగానే  తెల్లవారుజామున నాలుగు గంటలకే సీఐ  ఇంటికి ఎమ్మెల్యే  పెద్దారెడ్డి  ఎందుకు  వెళ్లారని  జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.  తెల్లవారుజామున  నాలుగు గంటలకే  సీఐ ఇంటికి  ఎందుకు  ఎమ్మెల్యే  వెళ్లాడని  ఆయన ప్రశ్నించారు.

 సీఐ  ఆనందరావు  ఫోన్ డేటాను ఎమ్మెల్యే డిలీట్  చేశారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  ఆరోపించారు.   సీఐ  ఆనందరావుపై  ఎమ్మెల్యే  పెద్దారెడ్డి ఒత్తిళ్లు తీసుకువచ్చారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  చెప్పారు.ఈ వేధింపులు భరించలేక  ఆనందరావు  ఆత్మహత్య చేసుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.  సీఐ ఆనందరావు  సూసైడ్ లెటర్  ఏమైందని ఆయన ప్రశ్నించారు. 

Latest Videos

undefined

ప్రభుత్వం నుండి వచ్చే  సహాయం రాదని సీఐ ఆనందరావు కుటుంబ సభ్యులను  ఎమ్మెల్యే  పెద్దారెడ్డి  బెదిరించారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  చెప్పారు. ఈ విషయమై  కుటుంబ సభ్యులు కూడ  పలు రకాలుగా వ్యాఖ్యలు  చేశారని ఆయన గుర్తు  చేశారు. రెండు రోజుల క్రితం సీఐ ఆనందరావు  ఆత్మహత్య  చేసుకున్నాడు. అయితే  సీఐ ఆనందరావు  ఆత్మహత్య చేసుకొనేంత  పిరికివాడు  కాదని  మృతుడి బాబాయ్  పేర్కొన్నారు.ఇదిలా ఉంటే   ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే  ఆనందరావు  ఆత్మహత్య చేసుకున్నాడని  పోలీసులు  పేర్కొన్నారు. 

తాడిపత్రి సీఐ  ఆనందరావు  మృతికి తనకు సంబంధం లేదని  ఎమ్మెల్యే  పెద్దారెడ్డి  స్పష్టం  చేశారు. రాజకీయ లబ్ది కోసమే  ఆనందరావు  మృతి విషయంలో  జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.తాడిపత్రిలో  గత కొంత కాలంగా  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే  పెద్దారెడ్డి మధ్య  సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.

click me!