ఆంధ్రులను తరిమి కొడతామని వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వస్తారో చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కేసీఆర్ ను ప్రశ్నించారు.
హైదరాబాద్: బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ఏపీలో అడుగు పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు.మంగళవారం నాడు విశాఖపట్టణంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రులను తరిమి కొడతామని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఆనాడు ఈ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రకు వస్తారని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రా నాయకత్వం, ఆంధ్రా పార్టీలు వద్దని చెప్పిన కేసీఆర్ కు ఇక్కడ ఏం పని అని జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం ఖాయమన్నారు. అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసింది కేసీఆరేనని ఆయన విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని వృధాగా సముద్రంలోకి విడుదల చేశారని జీవీఎల్ నరసింహరావు చెప్పారు.
undefined
ఆంధ్రకు రావాల్సిన నీటిని, నిధులను రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో అధికారం కోల్పోతున్నామనే భయంతో ఉనికి కోసం బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారన్నారు. ఏపీ ప్రజలు పౌరుషం ఉన్నవాళ్లని చెప్పారు. తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ మాదరిగా నోటీ దురుసు ఏపీ ప్రజలకు లేదన్నారు. ఏపీ ప్రజలు బీఆర్ఎస్ కు తగిన బుద్ది చెబుతారన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేసుకోవచ్చన్నారు.బీజేపీకి, మోడీకి ధీటుగా ఉన్నామని ప్రచారం చేసుకొనేందుకు కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేశారని జీవీఎల్ నరసింహరావు విమర్శించారు.
also read:బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్, రావెలకు ఢిల్లీలో కీలక బాధ్యతలు: కేసీఆర్
ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్ , పార్థసారథి, రావెల కిషోర్ బాబులు బీఆర్ఎస్ లో చేరారు. నిన్న హైద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ సమక్షంలో ఈ ముగ్గురు నేతలతో పాటు పలువురు బీఆర్ఎస్ లో చేరారు. రానున్న రోజుల్లో ఏపీకి చెందిన కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరుతారన్నారు. బీఆర్ఎస్ లో చేరేందుకు సిట్టింగ్ లు కూడా ఆసక్తిగా ఉన్నారని కేసీఆర్ ప్రకటించారు. సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ లో చేరికలు మరింతగా పెరిగే అవకాశం ఉందని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ ప్రకటించారు. రావెల కిషోర్ బాబును ఢిల్లీ కేంద్రంగా కీలక బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.