నీ శాఖే కాదు... ఆదమరిస్తే నువ్వు కూడా తాకట్టే: ఎక్సైజ్ మంత్రికి జవహర్ వార్నింగ్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Aug 25, 2021, 12:28 PM ISTUpdated : Aug 25, 2021, 12:38 PM IST
నీ శాఖే కాదు... ఆదమరిస్తే నువ్వు కూడా తాకట్టే: ఎక్సైజ్ మంత్రికి జవహర్ వార్నింగ్ (వీడియో)

సారాంశం

చంద్రబాబు, లోకేష్ లకు సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మాజీ మంత్రి జవహర్ విమర్శలు గుప్పించారు. సవాళ్లు మానకుంటే పాకి పనే ఆయనకు శాశ్వతం అవుతుందని హెచ్చరించారు.  

గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,  ఆయన తనయుడు నారా లోకేష్ కు సవాల్ విసిరిన మంత్రి నారాయణ స్వామిపై మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. సవాళ్లు మానేసి తన ఎక్సైజ్ శాఖను సరిగ్గా చూసుకుంటే మంచిదన్నారు. ఇప్పటికే పని లేక ఇంట్లో పాచి పనితోనే నారాయణ స్వామికి సరిపోతుందని... సవాళ్ళకు దిగితే ఆయనకు పాకిపనే శాశ్వతం అవుతుందని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. 

''తెలుగు దేశం పార్టీ ఇచ్చిన మాటపై నిలబడుతుంది. మరి మీరు ఇచ్చిన మద్యపాన నిషేధం సంగతేంటో తేల్చాలి. మీ శాఖనే కాదు ఆదమరిస్తే నిన్ను కూడా తాకట్టు పెడతారు. ఉప ముఖ్యమంత్రి అంటే ఉపాహారం అనుకునే నీకు మంత్రి పదవిచ్చారు. ముందు అది ఎలా వెలగబెట్టాలో చూడు'' అంటూ జవహర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

వీడియో

''రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల సంగతి చూడు స్వామి ముందు... ఆ తర్వాత మా సంగతి మాట్లాడు. అసలు చంద్రబాబుకు సవాల్ విసిరే స్థాయే నీది కాదు'' అంటూ మంత్రి నారాయణస్వామిపై  జవహర్  విరుచుకుపడ్డారు. 

నిన్న(మంగళవారం) చంద్రబాబు, లోకేష్ కు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు. వీరిద్దరు ఒంటరిగా పోటీచేసి కనీసం ఒక్కస్థానం గెలిచినా తాను చంద్రబాబు ఇంట్లో పాచి పని  చేయడానికి సిద్దమని ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్ పైనే తాజాగా మాజీ మంత్రి జవహర్ ఘాటుగా స్పందించారు. 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?