
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు కు చెందిన TDP నాయకుడు పోలవారపు హరిబాబు ను చీటింగ్ కేసు లో విజయవాడలో మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంగళగిరి లో ఆయన బాగా పేరున్న తెలుగు యువత నాయకుడు. అయితే,తన పలుకుబడి నుపయోగించి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగ యువకుల నుంచి హరిబాబు లక్షల్లో నగదు వసూలు చేశాడని పోలీసులకు ఫిర్యాదులందాయి. ఆయన మంత్రుల పేరు చెప్పి వసూళ్ల దందాలకు పాల్పడినట్లు కూడా ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఆయన మీద ఇప్పటికే చాలా కేసులున్నాయి. దీనితో ఈ రోజు మాటు వేసి మంగళగిరి పోలీసులు హరిబాబును విజయవాడు పట్టుకున్నారు.