వైసీపీ కోవర్టు డ్రామా.. తెలుగు తమ్ముళ్లు జాగ్రత్త: టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఆసక్తికర ట్వీట్

Published : Feb 02, 2023, 11:09 AM IST
వైసీపీ కోవర్టు డ్రామా.. తెలుగు తమ్ముళ్లు జాగ్రత్త: టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఆసక్తికర ట్వీట్

సారాంశం

టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ కోవర్టు డ్రామా స్టార్ట్ అయినట్లు ఉందని ఆరోపించారు. 

టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. వైసీపీ కోవర్టు డ్రామా స్టార్ట్ అయినట్లు ఉందని ఆరోపించిన బుచ్చయ్య చౌదరి.. రాబోయే వ్యుహం సినిమా స్కిప్ట్ అనుకుంటానని విమర్శించారు. జర జాగ్రత్త తెలుగు తమ్ముళ్లు అంటూ పిలుపునిచ్చారు. వైసీపీ కోవర్టు డ్రామ, జగన్ డైవర్షన్ పాలిటిక్స్ అనే హ్యాష్ ట్యాగ్‌లను కూడా జత చేశారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బుచ్చయ్య చౌదరి చేసిన ఈ ట్వీట్‌పై తెగ చర్చ సాగుతుంది. 

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై బుచ్చయ్య చౌదరి పరోక్షంగా చేసిన ట్వీట్ చేశారనే రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేయాలని అనకుంటున్నట్టుగా చెప్పిన మరుసటి రోజే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేయడం విశేషం. అధికార వైసీపీ గేమ్ ఆడుతుందని  చెబుతూనే.. ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను టీడీపీలో చేర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుచ్చయ్య చౌదరి ఈ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది.  

 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే