కడపలో దారుణం.. బార్‌లో కత్తులతో దాడి ఘటనలో ఇద్దరు మృతి

Published : Feb 02, 2023, 10:17 AM IST
కడపలో దారుణం.. బార్‌లో కత్తులతో దాడి ఘటనలో ఇద్దరు మృతి

సారాంశం

కడపలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఓ బార్‌లో బుధవారం రాత్రి కత్తులతో జరిగిన ఇద్దరు వ్యక్తులు మరణించారు.

కడపలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఓ బార్‌లో బుధవారం రాత్రి కత్తులతో జరిగిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒక్కరు ఘటన స్థలంలోనే మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వివరాలు.. నగరంలోని  రాజారెడ్డివీధికి చెందిన పేట నాగరాజుకు ఇద్దరు కుమారుల్లో రెండోవాడైన పేట రేవంత్‌ తన స్నేహితుడైన సియోన్‌పురం వాసి అభిలాష్‌తో కలిసి బుధవారం రాత్రి బార్‌కు వెళ్లారు. అక్కడ కొందరు దుండగులు వారిపై దాడి చేశారు. కత్తులతో అతి దారుణంగా దాడి చేయడంతో రేవంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన రేవంత్ స్నేహితుడు అభిలాష్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులు ఎవరు?, ఏ కారణంతో హత్య చేశారు? అనే అంశాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే