టీడీపీలో గంటా శ్రీనివాసరావు యాక్టివ్.. వారిని కలవడం వెనక ఎలాంటి ఆంతర్యం లేదని కామెంట్..

By Sumanth KanukulaFirst Published Jan 18, 2023, 2:08 PM IST
Highlights

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. రెండేళ్లు కోవిడ్‌, తర్వాత తన అనారోగ్య కారణాల వల్లే పార్టీలో యాక్టివ్‌గా ఉండలేకపోయానని చెప్పారు.

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. రెండేళ్లు కోవిడ్‌, తర్వాత తన అనారోగ్య కారణాల వల్లే పార్టీలో యాక్టివ్‌గా ఉండలేకపోయానని చెప్పారు. మధ్యలో పార్టీ  కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని.. ఇప్పటి నుంచి యాక్టివ్‌గా ఉంటానని చెప్పారు. నేడు ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో ఆయన విగ్రహానికి గంటా శ్రీనివాసరావు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

అనంతరం గంటా  శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సంచలనం సృష్టించడం ఖాయమని అన్నారు. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేయడం సంచలన విషయం అని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి లోకేష్ పాదయాత్ర పట్ల సానుకూల స్పందన వస్తుందన్నారు. దేశానికి యువతే చాలా కీలకమని అన్నారు. ఏపీలో యువత గత కొంతకాలంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. 

తాను చంద్రబాబు నాయుడు, లోకేష్‌లను కలవడం వెనక ఎలాంటి అంతర్యాలు లేవని చెప్పారు. కుటుంబంలోని వారిని అవసరం ఉన్నప్పుడూ కలుస్తూనే ఉంటామని తెలిపారు.

Also Read: నారా లోకేష్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ.. 40 నిమిషాల పాటు చర్చలు.. అందుకోసమేనా..?

ఇదిలా ఉంటే..  చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావు ఇటీవల నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో.. ఇరువురు నేతల మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. అయితే చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న గంటా శ్రీనివాసరావు.. ఇందుకు సంబంధించిన అంశాలను లోకేష్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది. ఆ భేటీ తర్వాత గంటా శ్రీనివాసరావు వైఖరిలో మార్పు వచ్చిందనే ప్రచారం కూడా టీడీపీ శ్రేణుల్లో సాగుతుంది. 
 

click me!