నేను మిస్టర్ క్లీన్, ఆ వ్యాఖ్యలతో ఏకీభవిస్తా: విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న

Published : Jan 18, 2023, 01:43 PM IST
నేను మిస్టర్ క్లీన్, ఆ వ్యాఖ్యలతో ఏకీభవిస్తా:  విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలపై   బుద్దా వెంకన్న

సారాంశం

తన పేరు పెట్టి  విజయవాడ ఎంపీ కేశినేని నాని  వ్యాఖ్యలు చేస్తే  తాను స్పందిస్తానని  టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.  

అమరావతి:విజయవాడ ఎంపీ  కేశినేని నాని  ఎవరి గురించి వ్యాఖ్యానించారో  స్పష్టంగా  చెబితే  తాను స్పందిస్తానని  టీడీపీ నేత  బుద్దా వెంకన్న చెప్పారు.బుధవారం నాడు  విజయవాడలో  ఆయన  మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాలంలో   విజయవాడ ఎంపీ కేశినేని నాని  చేసిన వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న  స్పందించారు.
తమ పేర్లు పెట్టి కేశినేని నాని  వ్యాఖ్యలు చేస్తే అప్పుడు స్పందిస్తానన్నారు. తాను మిస్టర్ క్లీన్ గా  ఉన్నానన్నారు. ఎంపీ నాని చేసిన వ్యాఖ్యలు తన గురించి కావని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలో  ప్రక్షాళన గురించి కేశినేని నాని  చేసిన వ్యాఖ్యలతో  తాను  ఏకేీభవిస్తున్నట్టుగా  బుద్దా వెంకన్న చెప్పారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో చిన్న విభేదాలే తప్ప తమ మధ్య కక్షలు లేవని బుద్దా వెంకన్న తెలిపారు.

also read:బాబు టికెట్ ఇవ్వకపోతే ఏమీ కాదు, పార్టీలతో పనిలేదు: విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలనం

తన సోదరుడు కేశినేని చిన్నితో పాటు మరో ముగ్గురికి సహకరించేది లేదని  ఆయన  స్పష్టం చేశారు.  నీతి, నిజాయితీపరులకు  టికెట్లు ఇవ్వాలని  నాని కోరారు.  పేదవాడికి టికెట్టు ఇస్తే  ఎంపీతో పాటు  ఇతర  పదవుల్లో అతడిని గెలిపించేదుకు తాను కృషి చేస్తానని కూడా  నాని  ప్రకటించిన విషయం తెలిసిందే. మాఫియా డాన్ లు, కాల్ మీనీ, రియల్ ఏస్టేట్ మోసగాళ్లకు  టికెట్లు ఇస్తే  తాను సహకరించబోనన్నారు. తన వ్యతిరేక వర్గంపై  కేశినేని నాని తాను సహకరించబోనని  తేల్చి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?