మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శుక్రవారంనాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. కొద్ది రోజులుగా ఆయన కొద్ది కాలంగా అస్వస్థతతో ఉన్నారు.
1949 ఏప్రిల్ 15న శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ఆయన జన్మించారు.బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తండ్రి సుబ్బరామిరెడ్డి కూడా శ్రీకాళహస్తి నుండి గతంలో ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ఇదే అసెంబ్లీ స్థానం నుండి బోజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలుపొందారు.
1968లో ఆయన బీఎస్సీ డిగ్రీ పొందారు. 1972 లో లా పట్టాను అందుకొన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలోనే ఆయన చదువుకున్నారు. కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి కూతురు బృందను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వివాహం చేసుకొన్నారు.1989లో బోజ్జల గోపాలకృష్ణారెడ్డి తొలిసారిగా శ్రీకాళహస్తి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో టీడీపీ తరపున తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు.1994,1999, 2009, 2014లలో కూడా ఆయన శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు.
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అటవీశాఖ మంత్రిగా పనిచేశాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రాష్ట్రం విడిపోయిన తర్వాత అవశేషఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో అటవీశాఖ మంత్రిగా ఆయన సేవలందించారు. చంద్రబాబునాయుడు కేబినెట్ విస్తరణ సమయంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తప్పించారు. అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయనను కేబినెట్ నుండి తప్పించినట్టుగా అప్పట్లో టీడీపీ వర్గాలు ప్రకటించాయి. ఇదే జిల్లా నుండి అమర్ నాథ్ రెడ్డిని కేబినెట్ లోకి చంద్రబాబు తీసుకొన్నారు.
గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడితో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంచి సంబంధాలుండేవి. గాలి ముద్దుకృష్ణమనాయుడు కొంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. ఈ ఇద్దరూ నేతలు పార్టీ కార్యాలయానికి కలిసి వచ్చేవారు. హైద్రాబాద్ నుండి చిత్తూరుకు వెళ్లే సమయంలో ఎక్కువ సార్లు కలిసి ప్రయాణం చేసేవాళ్లు. 2018 ఫిబ్రవరి 7వ తేదీన గాలి ముద్దకృష్ణమనాయుడు మరణించాడు. గత ఎన్నికల్లో నగరి నుండి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి పార్టీలో కీలక నేతలతో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, తెలంగాణ సీఎం కేసీఆర్ లతో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంచి సంబంధాలున్నాయి. పార్టీలు మారినా కూడా వీరి మధ్య ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి.
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి పార్టీలో కీలక నేతలతో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, తెలంగాణ సీఎం కేసీఆర్ లతో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంచి సంబంధాలున్నాయి. పార్టీలు మారినా కూడా వీరి మధ్య ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలుు స్వీకరించిన తర్వాత తిరుపతికి తొలిసారిగా వచ్చిన సమయంలో చిత్తూరు నుండి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ తో కలిసి స్వామివారిని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీవారి దర్శించుకొన్నారు.
చంద్రబాబుతో తొలుత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కొన్ని విబేధాలుండేవనే ప్రచారం అప్పట్లో టీడీపీలో ఉండేది. చంద్రబాబుతో సఖ్యత నెలకొన్న తర్వాత వీరి మధ్య గ్యాప్ ఏర్పడలేదని టీడీపీ సీనియర్లు గుర్తు చేసుకొంటున్నారు. ఏ విషయమైనా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పేవారు. పార్టీ తీసుకొనే నిర్ణయాల్లో కూడా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేవారు.