సబ్జెక్ట్ చెప్పమంటే.. బూతులు మాట్లాడతారా: మంత్రి అనిల్‌పై ఉమా ఫైర్

By Siva KodatiFirst Published Oct 30, 2020, 5:39 PM IST
Highlights

బాధ్యతగల ఇరిగేషన్ మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ అనిల్ కుమార్ యాదవ్‌పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. 

బాధ్యతగల ఇరిగేషన్ మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ అనిల్ కుమార్ యాదవ్‌పై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.

శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన అనిల్ కుమార్.. అధికారులను అడిగి డ్యామ్ అంటే ఏంటీ, ప్రాజెక్ట్ అంటే ఏంటీ, ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే ఏంటీ అనే విషయాలను తెలుసుకోవాలని సెటైర్లు వేశారు.

ఏమి అవగాహన లేకుండా మంత్రి మాట్లాడుతున్నారని ఉమా మండిపడ్డారు. సబ్జెక్ట్ మాట్లాడమంటే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2020 మే నాటికి 18000 ఇళ్లలోకి నిర్వాసితులను పంపిస్తామని డ్యామ్ సైట్‌లో చెప్పిన మంత్రి అనిల్ కుమార్.. ఇవాళ ముఖం చాటేస్తున్నారని దేవినేని ఉమా విమర్శించారు.

Also Read:మిమ్మల్ని మీ నేతలే నమ్మడం లేదు: లోకేష్ పై మంత్రి సెటైర్లు

అంతకుముందు పోలవరం నిర్మాణంలో ఇబ్బందులకు టీడీపీయే కారణమని ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. శుక్రవారం నాడు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.  

టీడీపీ నేతల మాదిరిగా తాము టూరిస్టు నేతలం కాదన్నారు. నిత్యం తాము ప్రజల మధ్య ఉంటామన్నారు. తన రెక్కల  కష్టంతో జగన్  వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చాడని ఆయన గుర్తు చేశారు.

మీ లాగా.. మీ నాన్న లాగా దొంగచాటుగా అధికారంలోకి రాలేదని  లోకేష్ పై మంత్రి విమర్శలు గుప్పించారు. మీ పార్టీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితులో లేరని మంత్రి లోకేష్ పై విమర్శించారు.

రాష్ట్ర పప్పు మారాజ్ లోకేష్ అంటూ ఆయన సెటైర్లు గుప్పించారు. మిడి మిడి అవగాహనతో లోకేష్ మాట్లాడుతున్నారని మంత్రి చెప్పారు. రైతులను జైలుకు పంపిన చరిత్ర మీ నాన్నదేనని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏనాడూ కూడ ప్రజల గురించి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. 
 

click me!