రాష్ట్రపతిభవన్ మాటలైనా తాడేపల్లి రాజప్రాసాదానికి వినబడుతున్నాయా?: దేవినేని ఉమ

By Arun Kumar PFirst Published Jul 17, 2020, 11:06 AM IST
Highlights

ఏపీలో ఏం జరుగుతుందో  తెలుసన్న రాష్ట్రపతి భవన్ మాటలు రాజప్రాసాదంలో వుండే ముఖ్యమంత్రి జగన్ కు వినపడుతున్నాయా? అని దేవినేని ఉమ నిలదీశారు. 

విజయవాడ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలిశారు. రాష్ట్రంలో గత 13 నెలలుగా ఏపీలో పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై వారు రాష్ట్రపతికి వివరించారు. అయితే ఏపీలో ఏం జరుగుతుందో  తెలుసన్న రాష్ట్రపతి భవన్ మాటలు రాజప్రాసాదంలో వుండే ముఖ్యమంత్రి జగన్ కు వినపడుతున్నాయా? అని దేవినేని ఉమ నిలదీశారు. 

''న్యాయస్థానాల నుండి 65 మొట్టికాయలు, విపక్షనేతలపై రాజకీయ కక్షసాధింపుతో కేసులు, దాడులు. ఇసుక,మద్యం, భూసేకరణలో అవినీతి, అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీనేతల భూకబ్జాలు, మీడియాకు బెదిరింపులు ఏంజరుగుతుందో తెలుసన్న రాష్ట్రపతిభవన్ మాటలు తాడేపల్లి రాజప్రసాదానికి వినబడుతున్నాయా? వైఎస్ జగన్ గారు'' అంటూ ఉమ నిలదీశారు. 

read more  అందరికీ కరోనా రావడం ఖాయం.. వైఎస్ జగన్ షాకింగ్ కామెంట్స్

ఇక వైసిపి ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సిద్దం చేసిన భూములు భారీ వర్షాలకు నీటమునగడంపై కూడా ఉమ స్పందించారు. 'జి.కొండూరు మండలం ముత్యాలంపాడు గ్రామంలో ముంపుప్రాంతంలో ఎకరాకు 45లక్షలు. నీటిమునకలో 86ఎకరాల సెంటుపట్టా భూములు. మెరకపేరుతో కోట్ల రూపాయల దోపిడీ. మీ ప్రజాప్రతినిదులు, వారి బంధువుల అవినీతి తాడేపల్లి రాజప్రసాదానికి కనబడుతుందా? ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి జగన్ గారు'' అని నిలదీశారు. 

''కృష్ణా జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలో పేదలకి పంచాల్సిన ఇళ్లస్థలాలు చెరువుల్ని మరిపిస్తున్నాయి..'' అంటూ నీటమునిగిన స్థలాలకు సంబంధించిన వీడియోలు జతచేస్తూ ట్వీట్ చేశారు. 

 ''మైలవరం మండలం ఎదురుబీడెంలో ఆ స్థలాలు లబ్దిదారులు మాకొద్దంటున్నారు మీపార్టీ నాయకులు,పోలీస్,రెవెన్యూ అధికారులు దౌర్జన్యంతో కేసులుపెట్టి 4దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న బీసీలవద్ద లాక్కున్న భూములు నీటిపాలుచేశారు మీపార్టీ ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు,అవినీతికి ఏంసమాధానం చెప్తారు'' అంటూ వరుస ట్వీట్ల ద్వారా సీఎం జగన్  ను ప్రశ్నించారు దేవినేని ఉమ.  

click me!