గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఆరో వార్డులో కిరాణ షాపు నిర్వహిస్తున్న వ్యాపారి దంపతులకు కరోనా సోకింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య మరణించింది. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దంపతుల కొడుకులో కరోనా లక్షణాలు కన్పిస్తున్నాయి.
నర్సరావుపేట:గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఆరో వార్డులో కిరాణ షాపు నిర్వహిస్తున్న వ్యాపారి దంపతులకు కరోనా సోకింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య మరణించింది. భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దంపతుల కొడుకులో కరోనా లక్షణాలు కన్పిస్తున్నాయి.
మూడు రోజుల క్రితం వ్యాపారి భార్య అస్వస్థతకు గురైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్యులు ఆమెకు చికిత్స చేయడానికి నిరాకరించారు.
undefined
also read:ఇండియాలో కరోనా విజృంభణ: 10 లక్షలు దాటిన కేసులు, 25 వేలు దాటిన మరణాలు
గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి ఆసుపత్రుల్లో కూడ ఇదే పరిస్థితి ఎదురైంది. నర్సరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దంపతులు చేరారు. వీరిద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్ వచ్చింది.దీంతో వారిని నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది.
తన తల్లీదండ్రులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆ దంపతుల కొడుకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో అధికారుల దృష్టికి వచ్చింది.
మహిళను అంబులెన్స్ లో ఎన్నారై ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. మృతదేహాన్ని నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్తను కూడ ఎన్నారై ఆసుపత్రికి తరలిస్తున్నారు. మూడు రోజులుగా వీరితోనే ఉంటున్న కొడుకులో కూడ కరోనా లక్షణాలు కన్పిస్తున్నాయి.
మరో వైపు ఇంటి వద్దే ఉన్న కూతురు వీరి కోసం ఆందోళన చెందుతోంది. కళ్ల ముందే తల్లి మరణించడం... తండ్రి కూడ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఆ కొడుకు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.