దేవినేని నెహ్రూ మృతి

First Published Apr 17, 2017, 1:55 AM IST
Highlights

విజయవాడ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ హటాత్తుగా మరణించారు. కొంతకాలంగా అస్వస్తతతో బాధపడుతున్న నెహ్రూ సోమవారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మృతిచెందారు.

విజయవాడ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ హటాత్తుగా మరణించారు. కొంతకాలంగా అస్వస్తతతో బాధపడుతున్న నెహ్రూ సోమవారం తెల్లవారుజామున సుమారు 5.30 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మృతిచెందారు. నెహ్రూ కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, చికిత్స తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన టిడిపితో రాజకీయాల్లోకి ప్రవేశించిన నెహ్రూ చాలా కాలం పాటు అదే పార్టీలో కొనసాగారు. అయితే, ఎన్టీఆర్ మరణం తర్వాత పార్టీలో ఇమడలేక కాంగ్రెస్ లో చేరారు.

అయితే, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవటంతో వేరే దారిలేక మళ్ళీ టిడిపిలో చేరారు. విజయవాడలోని ప్రముఖ రాజకీయ కుంటుంబాల్లో ఒకటైన దేవినేని కుంటుంబంలో నెహ్రూ చాలా కీలకంగా వ్యవహరించేవారు. ఇటీవలే ప్రముఖ సినీ దర్శకుడు తీసిన వంగవీటి సినిమాతో నెహ్రూపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి ఎంఎల్ఏ టిక్కెట్టు ఇచ్చే హామీతోనే నెహ్రూ టిడిపిలో చేరారని పార్టీ వర్గాలు చెప్పాయి.

అధికార పార్టీలోనే ఉన్నా, రాజధాని ప్రాంతానికి చెందినప్పటికీ కిడ్నీవ్యాధి కారణంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించటం లేదు. గడచిన ఐదు రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. అటువంటిది హటాత్తుగా ఉదయం మరణించారు. మృతదేహాన్ని సోమవారం సాయంత్రం విజయవాడలోని స్వగృహానికి తీసుకెళతారు. ఏమైనా నెహ్రై హఠాన్మరణం టిడిపికి పెద్ద దెబ్బే.

 

click me!