డిజిపి సవాంగ్ పై ఇంటెలిజెన్స్ నిఘా... భారీ మూల్యం తప్పదు: బుద్దా హెచ్చరిక

Arun Kumar P   | Asianet News
Published : Jul 26, 2021, 02:36 PM IST
డిజిపి సవాంగ్ పై ఇంటెలిజెన్స్ నిఘా... భారీ మూల్యం తప్పదు: బుద్దా హెచ్చరిక

సారాంశం

డీజీపీ అనే పదానికే గౌతమ్ సవాంగ్ అర్థాన్నే మార్చేశాడని... డైరెక్ట్ గా జగన్ కు పర్సనల్ పనులు చేసిపెట్టే అధికారి అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నాడని టిడిపి నాయకులు బుద్దా వెంకన్న మండిపడ్డారు. 

విజయవాడ: రాష్ట్రంలో ఎక్కడా శాంతిభద్రతలు చట్టప్రకారం అమలు కావడం లేదని... ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తోందని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మండిపడ్డారు. సీఎం జగన్ ఏం చెబితే అదేచేసే విధానాన్ని పోలీసులు ఎప్పుడైతే అనుసరించడం మొదలెట్టారో ఆనాటినుంచే రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై ప్రజ లకు నమ్మకం పోయిందన్నారు. అందుకు ప్రధాన కారణం డీజీపీయేనని వెంకన్న ఆరోపించారు. 

''డీజీపీ అనే పదానికే సవాంగ్ అర్థాన్ని మార్చేశాడు. డీజీపీ అంటే డైరెక్ట్ గా జగన్ కు పర్సనల్ గా పనిచేసే అధికారి అన్నట్లుగా సవాంగ్ ప్రవర్తిస్తున్నాడు. జగన్ చెప్పడమే అలస్యం అన్నట్లు పోలీసులు అత్యుత్సాహంతో పనిచేస్తూ టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై తప్పుడుకేసులు పెడుతున్నారు. కోర్టులు, కేంద్ర ప్రభుత్వం చెల్లవని చెప్పిన కేసులను కూడా డీజీపీ ప్రతిపక్షాలపై పెడుతున్నాడు'' అని మండిపడ్డారు. 

''ఏపీ పోలీస్ బాస్ డీజీపీ కాదు. ముఖ్యమంత్రి స్వయంగా డమ్మీ డీజీపీని నియమించారు. డీజీపీకి చట్టపరంగా సంక్రమించిన అధికారాలన్నింటినీ తానే తీసుకున్నారు. డీజీపీ సవాంగ్ పై రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు నిఘాపెట్టారని పోలీస్ అధికారులే చెప్పుకుంటున్నారు. అలాంటి స్థితి ఎందుకొచ్చిందో సవాంగ్ ఆలోచించుకోవాలి'' అని వెంకన్న సూచించారు. 

read more  జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ 30కి వాయిదా..

''సీఎం జగన్ దగ్గర మంత్రులుగా పనిచేస్తున్న వారు, ఆయన చుట్టూ ఉన్న అధికారులంతా గతంలో తప్పులుచేసి జైళ్లకు వెళ్లొచ్చినవారే. అలాంటివారి మాటలువినే డీజీపీ ఇప్పుడు పీకలవరకు మునిగిపోయాడు.  ఉమ్మడి రాష్ట్రంఉన్నప్పుడు గానీ, రాష్ట్రం విడిపోయాక గానీ హైకోర్టు బోనులో 5సార్లు నిలబడి... న్యాయమూర్తులతో చీవాట్లు తిన్నఏకైక డీజీపీగా సవాంగ్ చరిత్ర సృష్టించాడు'' అని ఎద్దేవా చేశారు. 

''పోలీస్ వ్యవస్థలో ఏ అధికారి చరిత్ర గురించి ఫైల్ పై రాయాలన్నా అది డీజీపీనే రాయాలి... అలానే ఐఏఎస్ ల గురించి రాయాలంటే చీఫ్ సెక్రటరీ రాయాలి. కానీ రాష్ట్రంలో ఎవరి గురించి ఏ రిపోర్ట్ రాయాలన్నా ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే రాస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను డమ్మీలను చేసి, మంత్రులను రోబోట్లను చేసి తానే రాజు – తానే మంత్రి అన్నట్లుగా జగన్ ఆడిస్తున్నారు. రెండేళ్ల పాలనలో జరిగిన అనేక సంఘటనలే అందుకు నిదర్శనమన్నారు. '' అని మండిపడ్డారు. 

''తన పరిధిలో పనిచేసే ఒక సీఐ స్థాయి అధికారిని కూడా బదిలీ చేయించుకోలేని దుస్థితికి సవాంగ్ చేరాడు. జగన్ రెడ్డి ఆదేశాలతో చట్టాన్నిమీరి, న్యాయాన్ని తుంగలో తొక్కి డీజీపీ టీడీపీ వారిపై పెట్టిన, పెడుతున్న తప్పుడు కేసులకు ఆయన భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించుకొని తీరుతాడు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సవాంగ్ ఎక్కడున్నాసరే, ఇప్పుడు చేస్తున్న తప్పులకు సమాధానం చెప్పుకోవాల్సిందే. ఆయన ఇప్పుడు అవలంభిస్తున్న విధానాలకు ఏనాటికైనా న్యాయస్థానాల్లో శిక్ష అనుభవించే తీరుతాడు'' అని వెంకన్న హెచ్చరించారు.
 

PREV
click me!

Recommended Stories

Tourism Minister Kandula Durgesh Super Speech at Amaravati Avakaya Festival | Asianet News Telugu
IMD Rain Alert: అక్క‌డ వ‌ర్షాలు, ఇక్కడ చ‌లి.. బ‌ల‌ప‌డుతోన్న అల్ప పీడ‌నం