కుప్పంలో నకిలీ పోలీసులు హల్ చల్... ఇన్నోవా కారుతో ఉడాయింపు

By Arun Kumar PFirst Published Jul 26, 2021, 1:58 PM IST
Highlights

పోలీసులమంటూ వాహనాలను ఆపి  తనిఖీల పేరిట కాస్సేపు హంగామా చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు నకిలీ పోలీసులు. ఇలాంటి ఘటనలు ఇటీవల చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. 

చిత్తూరు:ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు జిల్లా కుప్పంలో కర్ణాటక దొంగలు హల్ చల్ చేస్తున్నారు. పోలీసులమంటూ వాహనాలను ఆపి  తనిఖీల పేరిట కాస్సేపు హంగామా చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు ఈ నకిలీ పోలీసులు. సరిహద్దుల్లో కాపుకాసి ఇతర రాష్ట్రాలకు చెందిన వారిన బెదిరించి పెద్ద వాహనాలతో ఉడాయిస్తున్నారు. తాజాగా ఇలాగే ఓ ఇన్నోవా కారును దొంగిలించే ప్రయత్నంలో ఇద్దరు దొంగలు పట్టుబడ్డారు.  
 
వివరల్లో కెళితే.... తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు ఇన్నోవా వాహనంలో చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమాంబ దర్శనానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన వీరిని కుప్పం మండలం బంగారునత్తం గ్రామ సమీపంలోకి పోలీసులమంటూ ఓ ఐదుగురు ఆపారు. తనికీ చేస్తామంటూ ఇన్నోవా లోంచి భక్తులను కిందకు దించి వారు కారెక్కారు. ఇలా ముగ్గురు కారుతో ఉడాయించగా మరో ఇద్దరు అక్కడినుండి పారిపోయే ప్రయత్నం చేశారు. 

read more  నడిరోడ్డుపై అమ్మాయిలు.. వాహనదారులే టార్గెట్, ఇదో కొత్త రకం దందా

అయితే బాధితులు ఆ ఇద్దరిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన స్టైల్లో వారిని విచారించగా తమ వివరాలను బయటపెట్టారు. కర్ణాటకలోని కేజిఎఫ్ ప్రాంతానికి చెందినవారమని తెలిపారు. ఓ ముఠాగా ఏర్పడి పోలీసులమంటూ బెదిరింపులకు దిగుతూ దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఇన్నోవాతో పరారయిన ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 


 

click me!