డ్రగ్స్ కేసు: విజయసాయి, ఆయన అల్లుడిపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Oct 03, 2021, 04:54 PM IST
డ్రగ్స్ కేసు: విజయసాయి, ఆయన అల్లుడిపై బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఏపీలో డ్రగ్స్ దందాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడికి ప్రమేయం ఉందంటూ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి అల్లుడికి ఏపీలోని అనేక పోర్టుల్లో వాటాలు ఉన్నాయని, ఆయా పోర్టుల ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతోందని వెంకన్న ఆరోపించారు

ఏపీలో డ్రగ్స్ దందాలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడికి ప్రమేయం ఉందంటూ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి అల్లుడికి ఏపీలోని అనేక పోర్టుల్లో వాటాలు ఉన్నాయని, ఆయా పోర్టుల ద్వారా డ్రగ్స్ రవాణా జరుగుతోందని వెంకన్న ఆరోపించారు. విజయవాడ చిరునామా ఉపయోగించుకుని ఎంతో తెలివిగా డ్రగ్స్ వ్యాపారం కొనసాగిస్తున్నారని, దీని విలువ లక్షల కోట్లలో ఉంటుందని ఆయన అన్నారు.

ఇందులో ఈ రాష్ట్ర 'బిగ్ బాస్' తో పాటు విజయసాయికి కూడా భాగం ఉందని బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ కారణంగానే విజయసాయిరెడ్డి గత పది రోజులుగా కనిపించడంలేదని ఆయన మండిపడ్డారు. విజయసాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే డ్రగ్స్ భాగోతం గుట్టురట్టవుతుందని బుద్ధా వెంకన్న సూచించారు. ఈ వ్యవహారంలో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత 'బిగ్ బాస్' పై ఉందంటూ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి డ్రగ్స్ రవాణా వ్యవహారంపై 'బిగ్ బాస్' ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు
 

PREV
click me!

Recommended Stories

PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ