నిర్వాసితుల త్యాగం వల్లే పోలవరం కల నెరవేరుతోందన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు. అలాంటి నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం నిండు గోదావరిలో ముంచేసి, కష్టాల్లోకి నెట్టిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వారికి ఎన్నెన్నో హామీలిచ్చారని, కానీ, ఇప్పుడు వారిని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని దేవినేని మండిపడ్డారు.
నిర్వాసితుల త్యాగం వల్లే పోలవరం కల నెరవేరుతోందన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం నిండు గోదావరిలో ముంచేసి, కష్టాల్లోకి నెట్టిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వారికి ఎన్నెన్నో హామీలిచ్చారని, కానీ, ఇప్పుడు వారిని పట్టించుకోకుండా గాలికి వదిలేశారని దేవినేని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో సాగునీటి కోసం ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. ఎంత మంది నిర్వాసితులను ఆదుకున్నారని ప్రశ్నించారు. సాగునీటితో రైతులకు జరిగిన మేలేంటో శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు పనులపై నాటకాలాడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను సీఎం జగన్ ఎందుకు అడగడం లేదని దేవినేని ఉమా నిలదీశారు.