వివేకా కేసు .. మాటెందుకు మార్చారు, తాడేపల్లి ప్యాలెస్ బెదిరించిందా : అజేయ కల్లాంపై బీటెక్ రవి విమర్శలు

Siva Kodati |  
Published : Jul 29, 2023, 08:38 PM IST
వివేకా కేసు .. మాటెందుకు మార్చారు, తాడేపల్లి ప్యాలెస్ బెదిరించిందా : అజేయ కల్లాంపై బీటెక్ రవి విమర్శలు

సారాంశం

వైఎస్ వివేకానంద రెడ్డి కేసుపై రిటైర్డ్ ఐఏఎస్, సీఎం జగన్ ప్రధాన సలహాదారు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు టీడీపీ నేత బీటెక్ రవి. ఇలా మాట మార్చడం వెనుక ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్, సీఎం జగన్ ప్రధాన సలహాదారు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేత బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల పాటు కీలక పదవుల్లో వున్న అజేయ కల్లం తాడేపల్లి ప్యాలెస్ బెదిరింపులకు భయపడి వివేకా కేసులో మాట మారుస్తున్నారని ఆరోపించారు. సీబీఐ అధికారులు తనతో చిట్‌చాట్ చేశారని ఒకసారి, స్టేట్‌మెంట్ ఇచ్చానని మరోసారి, ఇప్పుడేమో తన వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు వక్రీకరించారని అంటున్నారని బీటెక్ రవి దుయ్యబట్టారు. ఇలా మాట మార్చడం వెనుక ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. 

గుండెపోటుతో వివేకా చనిపోయారని జగన్ చెప్పారని అజేయ కల్లం పేర్కొన్నారని.. కానీ మరోసారి బాత్‌రూమ్ సీన్ రిపీట్ అవుతుందనే భయంతో ఆయన తాడేపల్లి ప్యాలెస్ చెప్పినట్లుగా నటిస్తున్నారని బీటెక్ రవి ఆరోపించారు. అప్పుడు లోటస్‌పాండ్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న అజేయ కల్లం.. వివేకా ఎలా చనిపోయారో జగన్‌ను అడగలేదా అని ప్రశ్నించారు. తాను చెప్పని మాటలను చెప్పినట్లుగా సీబీఐ ప్రచారం చేస్తుంటే అజేయ కల్లం ఎందుకు మౌనంగా వున్నారని బీటెక్ రవి నిలదీశారు.

ALso Read : వివేకా హత్య కేసు: నేను చెప్పినదానిని సీబీఐ మార్చింది.. హైకోర్టును ఆశ్రయించిన అజయ్ కల్లాం..

కాగా.. అజేయ కల్లం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ  మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసుకు సంబంధించి రిట్ పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సీబీఐ సమర్పించిన వాంగ్మూలం  భిన్నంగా ఉందని పేర్కొన్నారు. 2023 ఏప్రిల్ 9న సీబీఐ తన స్టేటమ్‌మెంట్ రికార్డు చేసిందని  చెప్పారు. తాను చెప్పింది ఒక్కటైతే.. సీబీఐ దాన్ని మార్చి చార్జ్‌షీట్‌లో మరో విధంగా పేర్కొందని పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో వివక్ష, పక్షపాతం  లేకుండా  విచారణ సాగాలని  కోరారు. 

2019 మార్చి 15న హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ నివాసంలో ఉదయం  5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైందని చెప్పారు. సమావేశం ప్రారంభమైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారని తెలిపారు. ఓఎస్‌డీ కృష్ణమోహన్ వచ్చి జగన్‌కు ఏదో విషయం చెప్పారని.. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న(వైఎస్ వివేకానందరెడ్డి) చనిపోయారని చెప్పారని తెలిపారు. ఇంతకుమించి తాను సీబీఐకి చెప్పలేదని అన్నారు. 

కానీ సీబీఐ చార్జ్‌షీటులో తాను చెప్పిన విషయాలను మార్చివేసిందని ఆరోపించారు. సీఎం జగన్ భార్య ప్రస్తావన కానీ.. మరే ఇతర ప్రస్తావన కాని తాను  చేయలేదని రిట్ పిటిషన్‌లో అజయ్ కల్లం పేర్కొన్నారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో దర్యాప్తును తప్పుదోవ పట్టించే ధోరణి కనిపిస్తోందని అన్నారు. కొంతమందిని ఇరికించేందుకు సీబీఐ ఇలా చేస్తుందని ఆరోపించారు. ఇక, తన పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్రం, సీబీఐలను పేర్కొన్నారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్