యువతికి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి..!

By Mahesh KFirst Published Jul 29, 2023, 7:22 PM IST
Highlights

నెల్లూరుకు చెందిన ఓ యువతి లోన్ యాప్‌ల ద్వారా కేవలం 3,700 తీసుకుని మూడు రోజుల్లో తిరిగి చెల్లించింది. కానీ, ఇంకా డబ్బులు కావాలంటూ ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించారు. దీంతో ఆమె దిశ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదైంది.
 

నెల్లూరుకు చెందిన ఓ యువత లోన్ యాప్‌ల ద్వారా రూ. 3700 రుణం తీసుకుంది. వాటిని మూడు రోజుల్లోనే తిరిగి చెల్లించింది. కానీ, ఆ లోన్ యాప్‌ల నిర్వాహకులు డబ్బులు తీసుకుని ఊరుకోకుండా తమ వికృత రూపాన్ని ప్రదర్శించారు. ఇంకా డబ్బులు చెల్లించాలని ఆమె పై ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు, ఆ యువతి ఫొటోల మార్ఫింగ్ చేసి బెదిరించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె దిశ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగారు.

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లాలోని ఓ యువతి క్యాండీ క్యాష్, ఈజీ మనీ యాప్‌ల ద్వారా రూ. 3,700 లోన్ తీసుకుంది. ఆ రుణాన్ని మూడు రోజుల్లోనే చెల్లించింది. కానీ, ఇంకా డబ్బులు చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు ఆమెను వేధించారు. ఏకంగా ఆమె ఫొటోనలు మార్ఫింగ్ చేసి వేధించడం మొదలు పెట్టారు. దీంతో ఆమె దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుపై కోవూర్ పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. వేధింపులకు కుంగిపోవద్దని, ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని పోలీసులు ఆమెకు భరోసా ఇచ్చారు. లోన్ యాప్ నిర్వాహకులపై కేసు పెట్టిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Latest Videos

click me!