మాచర్లలో వైసీపీ నేతల దాడి నుంచి ప్రాణాలతో తిరిగొస్తామని అనుకోలేదన్నారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు కారు డ్రైవర్ యేసు.
మాచర్లలో వైసీపీ నేతల దాడి నుంచి ప్రాణాలతో తిరిగొస్తామని అనుకోలేదన్నారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు కారు డ్రైవర్ యేసు. వైసీపీ కార్యకర్తల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న అనంతరం బొండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్నలు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డ్రైవర్ యేసు దాడి జరిగిన తీరును మీడియాకు వివరించారు. లాయర్ కారుపై దాడి జరిగిన తర్వాత వెనుక కారులో ఉన్న బొండా ఉమాను చూసి రాళ్లతో దాడి చేశారని డ్రైవర్ తెలిపారు.
undefined
Also Read: పిల్లాడిని ఢీకొట్టామా.. ఏది జగన్‌పై ప్రమాణం చేయ్: పిన్నెల్లికి బుద్ధా వెంకన్న సవాల్
అక్కడ తప్పించుకున్నప్పటికీ, వదలకుండా కార్లు, మోటారు సైకిళ్లతో తమను వెంబడించారని అతను చెప్పాడు. డోర్ రాకపోవడం వల్ల నేతలపై దాడి చేయడం సాధ్యం కాలేదని, లేదంటే ఏం చేయాలనుకున్నారో అది చేసేవారని యేసు చెప్పారు.
మాచర్ల సెంటర్ నుంచి తప్పించుకున్న తర్వాత మరో ప్రదేశంలో ఆటోలు, లారీలు అడ్డం పెట్టి 200 నుంచి 300 మంది మారణాయుధాలతో సిద్ధంగా ఉన్నారని డ్రైవర్ వెల్లడించాడు.
Also Read:పోలీసుల నుంచే పిన్నెల్లికి ఇన్ఫర్మేషన్: మాచర్ల దాడిపై బొండా వ్యాఖ్యలు
ఆ సమయంలో గురజాల డీఎస్సీ రాకపోయుంటే ప్రాణాలతో బయటపడేవాళ్లం కాదని డ్రైవర్ యేసు చెప్పారు. మరో కారు డ్రైవర్ శ్రీను మాట్లాడుతూ బొండా ఉమా కారుపై దాడి జరగడాన్ని చూడటంతో తాను కారును వెనక్కి తిప్పినట్లు చెప్పాడు.