రేపే వస్తా, మాచర్ల సెంటర్‌లో చూసుకుందాం.. రా: పిన్నెల్లికి బొండా సవాల్

By Siva KodatiFirst Published Mar 11, 2020, 5:46 PM IST
Highlights

నీ ఊరు వచ్చిన నిరాయుధుల్ని చంపటానికి ప్రయత్నించావు, నీ ఊరికే రేపు వస్తానని అక్కడ చూసుకుందామని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బొండా సవాల్ విసిరారు.

నీ ఊరు వచ్చిన నిరాయుధుల్ని చంపటానికి ప్రయత్నించావు, నీ ఊరికే రేపు వస్తానని అక్కడ చూసుకుందామని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బొండా సవాల్ విసిరారు. తాము ఇక్కడే పుట్టామని, ఇక్కడే చస్తామని నీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని జగన్‌కు హితవు పలికారు.

మాచర్లకు వచ్చి సమాధానం చెప్పగల సత్తా తమకు ఉందని పిన్నెల్లిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ మాచర్ల టౌన్ అధ్యక్షుడు కిశోర్‌తో ఇంకో 30 మంది గుండాలను పెట్టి తమపై జగన్ దాడి చేయించారని బొండా ఉమా ఆరోపించారు.

Also Read:పోలీసుల నుంచే పిన్నెల్లికి ఇన్ఫర్మేషన్: మాచర్ల దాడిపై బొండా వ్యాఖ్యలు

వెల్దుర్దిలో డీఎస్పీ జయరాం వారి కారులో ఎక్కించుకుని ఒంగోలు వెళ్తుండగా ముందు మరో 200 మంది గుండాలు మారణాయుధాలతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని బొండా చెప్పారు.

మూడు చోట్ల తాము తప్పించుకోవడంతో వెల్దుర్దిలో కాపు కాశారని, ఆ సమయంలో పోలీసులపైనా దాడి చేశారని డీఎస్పీ తుపాకీతో బెదిరించి అడ్డుగా నిలిచారని బొండా ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు నిమిషాల వ్యవధిలో తమ ప్రాణాలు పోయేవని టీడీపీ ఆఫీసులు తమ భౌతికకాయాలకు నివాళీ అర్పించాల్సిన పరిస్ధితి వచ్చేదని బొండా ఉమా ఉద్వేగంగా చెప్పారు. ఏం చేశామని తమను చంపాలని అనుకున్నారని, పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్నందుకు హత్యాయత్నం చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని బొండా కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read:మాచర్ల దాడి: బోండా ఉమా కారు ఢీకొట్టింది ఇతన్నే... వీడియో వైరల్

తాము గ్రామంలో చిన్నారిని ఢీకొట్టామని, అప్పుడు అనుకోని విధంగా ఈ సంఘటన జరిగిందని పిన్నెల్లి చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. డీఎస్పీ జయరాం కనుక ఆ రోడ్డులో రాకపోయుంటే మమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేని పరిస్ధితి నెలకొందని బొండా స్పష్టం చేశారు. తమ వెనకాల వచ్చిన గన్‌మెన్, పీఏలు ఏమయ్యారో తెలియదని బొండా ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. 
 

click me!