మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత రామ సుబ్బారెడ్డి బుధవారం నాడు వైసీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో రామసుబ్బారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు.
అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత రామ సుబ్బారెడ్డి బుధవారం నాడు వైసీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో రామసుబ్బారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు.
Also read:చంద్రబాబుకు షాక్: టీడీపీకి సతీష్ రెడ్డి రాజీనామా
కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పలు దఫాలు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. టీడీపీని వీడాలని రామసుబ్బారెడ్డి కొంత కాలంగా భావిస్తున్నారు.
Also read:బాబుకు షాక్, మాట మార్చిన రామసుబ్బారెడ్డి: రేపు జగన్ సమక్షంలో వైసీపీలోకి
పార్టీ కార్యకర్తలతో రామ సుబ్బారెడ్డి రెండు మూడు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ మార్పుపై కార్యకర్తలతో చర్చించారు.బుధవారం నాడు సాయంత్రం రామసుబ్బారెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో రామసుబ్బారెడ్డితో పాటు కొందరు టీడీపీ నేతలు ఆయనతో పాటు వైసీపీలో చేరారు.
పులివెందుల నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డి టీడీపీకి మంగళవారం నాడు రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేసిన మరునాడే రామసుబ్బారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
Also read:బెదిరించలేదు, స్వచ్ఛంధంగానే వైసీపీలోకి: బాబుకు రామసుబ్బారెడ్డి కౌంటర్
జమ్మలమడుగు నియోజకవర్గంలో దేవగుడి కుటుంబానికి రామసుబ్బారెడ్డి కుటుంబానికి మధ్య చాలా ఏళ్లుగా గొడవలు ఉన్నాయి. రామసుబ్బారెడ్డి బాబాయి శివారెడ్డి బతికున్న సమయం నుండి దేవగుడి కుటుంబానికి మధ్య ఘర్షణలు ఉన్నాయి.
2014 తర్వాత దేవగుడి కుటుంబానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సమయంలో రామసుబ్బారెడ్డి వర్గీయులు వ్యతిరేకించారు. కానీ వీరిద్దరి మధ్య చంద్రబాబునాయుడు సయోధ్య కుదిర్చారు.
2019 ఏప్రిల్ లో ఎన్నికల సమయంలో కడప పార్లమెంట్ స్థానం నుండి ఆదినారాయణ రెడ్డి ఎంపీ స్తానానికి పోటీ చేశారు. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుండి రామసుబ్బారెడ్డి పోటీ చేశారు. అయితే వీరిద్దరూ కూడ వైసీపీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు.
ఎన్నికల తర్వాత ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని చేపట్టింది. దీంతో ఆదినారాయణరెడ్డి మాత్రం బీజేపీలో చేరారు.ప్రస్తుతం మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాత్రం వైసీపీలో చేరాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. రామసుబ్బారెడ్డితో వైసీపీ కీలక నేతలు రెండు రోజుల క్రితం చర్చలు జరిపారు.జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కూడ ఈ విషయమై వైసీపీ అగ్ర నేతలు ఒప్పించారని చెబుతున్నారు.
జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ పదవి
రామసుబ్బారెడ్డి తనయుడికి కడప జిల్లా పరిషత్ వైఎస్ ఛైర్మెన్ పదవిని ఇచ్చేందుకు వైసీపీ అంగీకరించిందని సమాచారం. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం నుండి జడ్‌పీటీసీ సభ్యుడిగా బరిలోకి దింపనున్నారు. రామ సుబ్బారెడ్డి తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరినట్టుగా చెబుతున్నారు.