హిందూ మతంపై జగన్‌కి కక్ష.. పండుగను అడ్డుకోవాలనే ప్లాన్, వినాయక పందిళ్లపైనా ట్యాక్స్ : బోండా ఉమా

By Siva KodatiFirst Published Aug 23, 2022, 3:48 PM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు. హిందూ మతంపై జగన్‌కి కక్ష వుందని... అందుకే వినాయక పందిళ్లపై రోజుకు వెయ్యి ట్యాక్స్ పెట్టారని ఉమా ఆరోపించారు. 
 

వినాయక పందిరికి రోజుకు వెయ్యి రూపాయలు పన్ను కట్టమనటం హేయమైన చర్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పనికిమాలిన నిబంధనలు పెట్టి రాష్ట్రంలో వినాయక చవితి జరగకుండా చేసి పండుగ ప్రాసిస్త్యం తహహించేలా జగన్ రెడ్డి చర్యలున్నాయని మండిపడ్డారు. హిందూమతం మీద జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న కక్ష సాధింపులో భాగంగానే చవితి వేడుకలకు అనేక నిబంధనలు పెట్టారని బోండా ఉమా ఆరోపించారు. పండుగల మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటని ఆయన నిలదీశారు. 

పనికిమాలిన జీవోలు రద్దు చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బోండా ఉమా హెచ్చరించారు. పండుగలెలా చేసుకోవాలో కూడా ప్రభుత్వమే శాసించేలా జగన్ రెడ్డి తుగ్లక్ పాలన ఉందన్నారు. వినాయక చవితి పండుగ సంప్రదాయాలకు తగ్గట్లు కాకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు జరపాలనటం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వైసీపీ ప్రభుత్వం దాడులుకు తెగబడుతోందని బోండా ఉమ విమర్శించారు. వినాయక చవితి పందరికి మాలిన నిబంధనలు పెట్టారని.. పండుగ జరగకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. 

చెంతాడు అంత నిబంధనలు పెట్టి వినాయక చవితిని ప్రభుత్వం అడ్డుకుంటోందని బోండా ఉమా విమర్శించారు. పిచ్చివాడి చేతిలో రాయి లాగా జగన్మోహన్ రెడ్డి వ్యహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ హిందూ దేవాలయాలపై వరుస దాడులు కొనసాగించారని బోండా ఉమా ఆరోపించారు. తుగ్లక్ నిబంధనలకు భయపడకుండా ప్రజలు వినాయక చవితి పండుగ నిర్వహించుకుంటే తెలుగుదేశం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 

click me!