ఆమెకు 50, అతనికి 23... సహజీవనం చేస్తూ, ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు అనుమానాస్పద మృతి...

Published : Aug 23, 2022, 10:33 AM IST
ఆమెకు 50, అతనికి 23... సహజీవనం చేస్తూ, ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు అనుమానాస్పద మృతి...

సారాంశం

తనకంటే రెట్టింపు వయసున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. సహజీవనం చేస్తున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురంలో జరిగింది. 

అనంతపురం :  గోరంట్ల మండలంలోని చింతలపల్లికి చెందిన ప్రియురాలు బోయ రామకుమారి ఇంట్లో ప్రియుడు ఈడిగ సురేష్ (23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై ఇక్బాల్ బాషా  తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కాసిరాళ్ల గ్రామానికి చెందిన వేణుమూర్తి, కుమారుడు సురేష్ పలమనేరులోని కోళ్ల ఫారంలో పని చేసేవాడు. చింతలపల్లికి చెందిన రామకుమారి ఉపాధి కోసం వలస వెళ్లి, అక్కడే పనిచేసేది. ఆమె 50 ఏళ్ల వితంతువు. ఆమెకు సురేష్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తన చెల్లెలు కుమార్తెతో సురేష్ కు పెళ్లి చేస్తానని నమ్మించింది.  

అది సురేష్ నమ్మాడు.. రామకుమారి కూడా పని వదిలేసి సురేష్ ను చింతలపల్లికి తీసుకు వచ్చింది. ఆ తరువాత గ్రామంలో ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేసేవారు. సురేష్ తాగుడుకు బానిసయ్యాడు. కొన్నాళ్లుగా వ్యవసాయ కూలి పనికి వెడుతున్నాడు. సురేష్ తల్లిదండ్రులు కొంతకాలం క్రితం కొడుకును తీసుకువెళ్లాలని గ్రామానికి వచ్చారు. సురేష్ చావనైనా చస్తాను గాని.. తాను వచ్చేది లేదంటూ కత్తితో కోసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఇటీవల పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్న సురేష్ శనివారం రాత్రి రోజూలాగే నిద్రపోయాడు. ఆదివారం ఉదయం ఎంతసేపటికి లేవలేదు.

ప్రియుడి మోసం.. భవనానికి నిప్పుపెట్టి 46మంది ప్రాణాలు తీసిన ప్రియురాలు..కోర్టు ఏమందంటే...

ఆ తర్వాత అతను మృతి చెందినట్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు చింతలపల్లికి వచ్చారు.  అనారోగ్యంతోఉన్న తన కుమారుడికి చికిత్స చేయించకుండా మృతికి కారణమైన వారిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సురేష్ మృతదేహానికి పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో  సోమవారం  పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లుఎస్ఐ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: చంద్రబాబు పంచ్ లకి పడి పడి నవ్విన నారా భువనేశ్వరి| Asianet News Telugu
Vangalapudi Anitha Strong Warning to Jagan: గుర్తుపెట్టుకో జగన్ ఎవ్వరినీ వదిలిపెట్టం |Asianet Telugu