ప్రజారాజ్యంలో అసలైన కోవర్ట్ పవన్ కల్యాణే.. పీఆర్పీకి పవర్ రాలేదని అన్నయ్యనే పట్టించుకోలేదు : వెల్లంపల్లి

By Siva KodatiFirst Published Aug 23, 2022, 3:12 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కళ్యాణేనని.. చిరంజీవికి అధికారం రాలేదని ఆయన్ని పక్కకి పెట్టింది పవనేనంటూ శ్రీనివాస్ ఆరోపించారు. 
 

టీడీపీ కార్యకర్తలకు కూడా పథకాలు అందిస్తున్నామన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేశినేని నాని ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియదన్నారు. ఎంపీగా ఉన్నా మా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని వెల్లంపల్లి దుయ్యబట్టారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో బయటికి వచ్చాడని పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కళ్యాణేనని వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవికి అధికారం రాలేదని ఆయన్ని పక్కకి పెట్టింది పవనేనంటూ శ్రీనివాస్ ఆరోపించారు. 

18 సీట్లు వచ్చాయని పార్టీలో కనపడలేదని.. దిక్కుమాలిన పవన్ అప్పుడు ఏం పీకాడని వెల్లంపల్లి ప్రశ్నించారు. నాడు ప్రజారాజ్యంను విలీనం చేయవద్దని ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు. ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణం పవన్ కళ్యాణేనని.. మేం పిలిస్తున్నా పవన్ రావడం లేదని నాగబాబు మెగా అభిమానుల మధ్యే  చెప్పారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. జనసేనకి ఇప్పుడు చిరంజీవి అవసరం వచ్చిందని.. చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడున్నాడని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ లక్ష్యమని.. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌గా కూడా గెలవలేరంటూ వెల్లంపల్లి జోస్యం చెప్పారు. 

ఇకపోతే.. సోమవారం నాడు పవన్ కల్యాణ్ గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ రాష్ట్రంలో వైసీపీ విముక్త  ఏపీ రాష్ట్రం కోసం తమ ప్లాన్స్ తమకు ఉన్నాయని పవన్  కళ్యాణ్ చెప్పారు.రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయో తెలియవన్నారు. అందుకే బీజేపీ, జనసేన,  లేదా బీజేపీ, జనసేన, టీడీపీ, జనసేన, టీడీపీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామా అనే విషయాన్ని ఇప్పటికిప్పుడే చెప్పలేమని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.  

ALso REad:వైసీపీ విముక్త ఏపీయే టార్గెట్, మా ప్లాన్స్ మాకున్నాయి:పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరగడానికి ముందు టీఆర్ఎస్ ను కేసీఆర్ కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కూడా సిద్దమయ్యారన్నారు. కానీ కేసీఆర్ వ్యూహాం మారడానికి కారణం ఏమిటో తెలియదన్నారు. కానీ ఒంటరిగా పోటీ చేసి టీఆర్ఎస్ చాలా రిస్క్ తీసుకొందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పార్టీలో ఒకరిద్దరిలో కోవర్టు ఛాయలు కన్పిస్తున్నాయన్నారు. కొందరు తనను వెనక్కు లాగే ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలో  ఉంటూ పార్టీని నష్ట పెట్టే వారి కంటే ప్రత్యర్ధులు గెలవడమే బెటర్ అని తాను కోరుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పారు. 

మీ తప్పులు సరిదిద్దుకోవాలని కూడా పార్టీ నేతలను కోరినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలో ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చని కూడా పవన్ కళ్యాణ్ నిర్మోహామాటంగా ప్రకటించారు. పార్టీలో ఉంటూ ఏ ఒక్క తప్పు చేసినా కూడా సస్పెండ్ చేస్తామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పాదయాత్రలు చేసిన వారంతా వినోభాభావేలు కాలేరన్నారు. పాదయాత్ర చేసిన వారు ఆంధ్రా థావోస్ గా మారినవాళ్లూ ఉన్నారని పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. 

click me!