ప్రాణం పోతున్నా జగన్, విజయసాయితో కలిసేది లేదు: మాజీ మంత్రి బండారు స్పష్టం (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 7, 2021, 3:39 PM IST
Highlights

తన ప్రాణం పోతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డితో కలవబోనని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి స్పష్టం చేశారు. 

విశాఖపట్నం: తన ప్రాణం పోతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసేది లేదని తేల్చిచెప్పారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి. విశాఖలో అక్రమాలపై విజయసాయి రెడ్డి టోల్ ఫ్రీ నెంబర్ అన్నారు...ఆ నెంబర్ ఎంతో చెప్పాలని మాజీ మంత్రి ప్రశ్నించారు. కడు పేదరికంలో వున్న విజయసాయి రెడ్డికి పేదల కోటాలో  ఇళ్ల స్థలం కేటాయించాలంటూ సత్యనారాయణమూర్తి ఎద్దేవా చేశారు. 

విశాఖపట్నం టిడిపి కార్యాలయంలో మంగళవారం టిడిపి నాయకులు సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మాస్టర్ ప్లాన్ అవినీతిమయంగా వుందన్నారు.  ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుంచి హనుమంతు వాక వరకు రోడ్ ఎందుకు మాస్టర్ ప్లాన్ లో చేర్చారు? అని ప్రశ్నించారు. ఈ రోడ్డును ఎవరు మంజూరు చేశారు... ఎవరి కోసం ఈ రోడ్డు వేస్తున్నారు..? ఈ నిర్ణయం అవినీతికి పరాకాష్ట అని మాజీ మంత్రి మండిపడ్డారు.  

వీడియో

''భూములను 22ఏ లో పెడతామని బెదిరిస్తున్నారు. పెందుర్తి గ్రీన్ బెల్ట్ లో కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చింది. రైతులు సాగు చేస్తున్న భూములు గ్రీన్ బెల్ట్ గా మార్చారు. పాత వి.ఎం.ఆర్.డి.ఏ కమిషనర్ పై విచారణ జరిపించాలి'' అని సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. 

read more  నీ పులివెందులలోనే... ఇదీ రైతన్నల పరిస్థితి: సీఎం జగన్ కు కళా చురకలు

''22ఏ లో చిన్నచిన్న వాళ్ళ భూములు పెట్టి పెద్ద వాళ్లకు మేలు చేస్తున్నారు. సింహాచలం అప్పన్న భూముల్ని 22ఏ లొనే ఎందుకు ఉంచారు? ఎంపీ విజయసాయి రెడ్డి, జిల్లా మంత్రి, ఇంచార్జి మంత్రి సమాధానం చెప్పాలి'' అని నిలదీశారు. 

''గతంలో అవినీతికి పాల్పడిన వాళ్ళకి ఈ ప్రభుత్వం ఉన్నత పదవులు కట్టబెట్టింది. అవినీతికి విశ్వరూపం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వి.ఎం.ఆర్.డి.ఏ చరిత్రలోనే అత్యంత అవినీతి జరిగింది. 16 వేల అప్లికేషన్లు ప్రజల నుండి విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరం తెలుపుతూ వచ్చాయి. అయినా ఎందుకు పట్టించుకోవడం లేదు'' అని అడిగారు. 

''రిజర్వ్ ఫారెస్ట్ లో అడ్డగోలుగా రోడ్లు ఎలా వేస్తారు? ఆరోపణలపై కూడా వైసీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు కనీసం ఖండించడం లేదు. వి.ఎం.ఆర్.డి.ఎ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసి కొత్తది వెయ్యాలి'' అని మాజీ మంత్రి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. 

 

 

click me!