ఆలయం ప్రారంభోత్సవంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్.. !

By AN TeluguFirst Published Sep 7, 2021, 3:09 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఊర్లో ఆలయం ప్రారంభోత్సవం జరిగింది. మామూలుగా ఆలయం ప్రారంభోత్సవం అంటే మంత్రాలు, యాగాలు.. పూజలు ఇవే కదా ఉండేవి. కానీ అక్కడ మాత్రం డిఫరెంట్.. రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. పైగా కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. 
 

ఓ వైపు కరోనా విలయ తాండవం ఆగడం లేదు. మరోవైపు ఎవరి ఇష్టారాజ్యంగా వాళ్లు వ్యవహరిస్తున్నారు. అయినదానికి, కాని దానికీ జనాలు ఒక్కచోటు చేరి కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాలు వింటే.. 

ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఊర్లో ఆలయం ప్రారంభోత్సవం జరిగింది. మామూలుగా ఆలయం ప్రారంభోత్సవం అంటే మంత్రాలు, యాగాలు.. పూజలు ఇవే కదా ఉండేవి. కానీ అక్కడ మాత్రం డిఫరెంట్.. రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. పైగా కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. 

డీజే పాటలతో, యువతుల నృత్యాలతో హోరెత్తించారు. డ్యాన్సులను చూసి తెగ ఎంజాయ్ చేశారు. ఇంత జరుగుతుంటే.. పోలీసుల పక్కనే ఉన్నా కన్నెత్తి చూడలేదు, గుడి ఓపెనింగ్ కి రికార్డింగ్ డ్యాన్సులేంటని ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. 

దీంతో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామన్న పోలీసులు మాటల మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయం ప్రారంభోత్సవం అయ్యాక రాత్రి పూట రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. దీంట్లో ఊర్లోని అందరూ పాల్గొని తెగ ఎంజాయ్ చేశారు. ఇది పోలీసులకు కనిపించడం లేదా అని జనాలు ప్రశ్నిస్తున్నారు.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురం గ్రామంలో. కందులాపురం గ్రామంలో ఓ గుడి ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా, ఆలయ నిర్వాహకులు ఈ విధంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసి, కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. 

ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడంతో స్థానికులు మండిపడుతున్నారు. పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులతో పాటు, ఆలయ నిర్వాహకుల మీదా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 

click me!