మాట్లాడితే జైల్లో వేస్తావా, రౌడీలతో కొట్టిస్తావా: జగన్ మీద అయ్యన్న

By telugu teamFirst Published Sep 19, 2020, 12:00 PM IST
Highlights

మంత్రి జయరాంపై మరోసారి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రి కుమారుడికి ఈఎస్ఐ స్కామ్ నిందితుడు బెంజ్ కారు బహుమతి ఇచ్చిన వైనంపై మరిన్ని ఆధారాలు చూపిస్తానని ఆయన అన్నారు.

విశాఖపట్నం: మంత్రి జయరాం కుమారుడి బెంజ్ కారు వివాదంపై టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు మరిన్ని ఆరోపణలు చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో 14వ నిందితుడిగా ఉన్న వ్యక్తి మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన శనివారం మరిన్ని అధారాలను బయటపెట్టారు. 

అవినీతిని ప్రశ్నిస్తే జైల్లో వేస్తావా, రౌడీలతో కొట్టిస్తావా అని ఆయన సీఎం జగన్ ను ప్రశ్నించారు. బెంజ్ కారు విషయంలో మంత్రి జయరాం అడ్డంగా బుక్కయ్యారని ఆయన అన్నారు. బెంజ్ కారుపై మరిన్ని ఆధారాలు చూపిస్తానని, ఒక్కొటొక్కటే ఆధారాలు బయటపెడుతానని ఆయన అన్నారు. జయరాం అవినీతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రిని కాపాడేందుకు ప్రయత్నించవద్దని ఆయన అన్నారు. 

Also Read: ఈఎస్ఐ స్కాంలో మంత్రి జయరాం పాత్ర: సంచలన ఆరోపణలు చేసిన అయ్యన్నపాత్రుడు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెదిరింపులకు భయపడబోమని ఆయన అన్నారు. తాము మాట్లాడితే జైల్లో వేస్తావా, రౌడీలతో కొట్టిస్తావా అని ఆయన ప్ఱశ్నించారు. కర్నూలు భారీ భూకుంభకోణం జరిగిందని, జయరాం భూ కుంభకోణాన్ని బయటపెడుతానని ఆయన అన్నారు.

మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ కు ఈఎస్ఐ కుంభకోణం కేసులో 14వ నిందితుడు బెంజ్ కారు బహుమతి ఇచ్చాడని ఆరోపిస్తూ అయ్యన్న పాత్రుడు ఇంతకు ముందు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఏసీబీకి ఫిర్యాదు కూడా చేశారు. 2019 డిసెంబర్ నెలలో బెంజ్ కారును అతను బహుమతిగా ఇచ్చాడని ఆయన అన్నారు. 

Also Read: ఆ కారు నా కొడుకుది కాదు: అయ్యన్న ఆరోపణలపై మంత్రి జయరాం

అయ్యన్నపాత్రుడి ఆరోపణలపై మంత్రి జయరాం ఇప్పటికే స్పందించారు. ఆ కారు తన కుమారుడిది కాదని చెప్పారు. అయినప్పటికీ మరిన్ని ఆరోపణలో అయ్యన్నపాత్రుడు శనివారం మీడియా ముందుకు వచ్చారు.

click me!