అయ్యన్నపాత్రుడికి ఊరట.. కుమారుడితో సహా బెయిల్, న్యాయం గెలిచిందన్న చంద్రబాబు

By Siva KodatiFirst Published Nov 3, 2022, 8:05 PM IST
Highlights

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి అతని కుమారుడు రాజేశ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచింది.. న్యాయమే గెలిచిందంటూ వ్యాఖ్యానించారు. 

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి కోర్టులో ఊరట లభించింది. గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్‌ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం వారిద్దరికి వైద్య పరీక్షలు పూర్తి చేసి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అయ్యన్న, రాజేష్‌ల రిమాండ్‌ను తిరస్కరించారు. ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని తెలిపారు. దీంతో వారిద్దరికి అక్కడికక్కడే బెయిల్ మంజూరు చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచింది.. న్యాయమే గెలిచిందంటూ వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే.. అయ్యనపాత్రుడును, ఆయన కుమారుడు రాజేష్‌లను గురువారం  తెల్లవారుజామున ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో అయ్యనపాత్రుడు హైకోర్టుకు నకిలీ సర్టిఫికెట్ సమర్పించారని ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అయ్యనపాత్రుడితో సహాయ ఆయన ఇద్దరు కుమారులు విజయ్‌, రాజేష్‌లపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి చేరకున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక, అయ్యన్నపాత్రుడిని, ఆయన కుమారుడిని సీఐడీ పోలీసులు ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నట్టుగా తెలుస్తోంది.

ALso Read:ఎన్‌వోసీని ఫోర్జరీ చేశారు.. అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు రాజేష్ అరెస్ట్‌పై వివరణ ఇచ్చిన ఏపీ సీఐడీ

పోలీసులు తీరుపై అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అయ్యన్న పాత్రుడు, రాజేష్‌లను ప్రభుత్వం అరెస్టు చేసిందని అయ్యన్న భార్య పద్మావతి విమర్శించారు. తన  భర్త, కుమారుడికి ప్రాణాహాని ఉందని ఆరోపించారు. వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక, అయ్యన్న అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నర్సీపట్నం బంద్‌కు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సహా పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు.. అయ్యనపాత్రుడు అరెస్ట్‌ను ఖండించారు. 

click me!