పోలీస్‌ స్టేషన్ భవనంపై నుండి దూకి టీడీపీ నేత అవినాష్ ఆత్మహత్యాయత్నం

By narsimha lode  |  First Published Mar 6, 2020, 12:48 PM IST

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేత అవినాష్ పోలీస్ స్టేషన్‌  భవనంపై నుండి దూకి శుక్రవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.



శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌  భవనం  పై నుండి  టీడీపీ నేత  అవినాష్ దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.విచారణ పేరుతో పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని  అవినాష్ ఆరోపిస్తున్నాడు.అతడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.

Also read:స్ధానిక సంస్ధల ఎన్నికల బాధ్యతలు ఆ పెద్దరెడ్లకే... ఎందుకంటే: వర్ల రామయ్య

Latest Videos

శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి  కొడుకు అవినాష్ కొడుకు అవినాష్.   ఎస్ఎం‌పురం లో శివాలయం విషయమై టీడీపీ, వైసీపీ మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి. నాలుగు మాసాలుగా ఈ గుడి ప్రారంభోత్సవం జరగలేదు. ఈ విషయమై రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై ఆయనను విచారణ కోసం అవినాష్‌ను ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.

ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌‌ భవనం రెండో అంతస్థు నుండి ఆయన దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న కారుపై ఆయన పడిపోయాడు. దీంతో ఆయనను స్థానికులు వెంటనే  ఆసుపత్రికి తరలించారు. 

శ్రీకాకుళం జిల్లా కిమ్స్‌లో ఆయనను చేర్పించారు. కిమ్స్‌లో ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్‌ భవనం పై నుండి కిందకి దూకడానికి ముందు సోషల్ మీడియాలో అవినాష్  తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని భావించినట్టుగా ప్రకటించారు. 

ఆ తర్వాత ఆయన  భవనం నుండి కిందకు దూకాడు. అయితే అతను దూకిన  ప్రాంతంలో కారు పార్క్ చేసి ఉంది. కారుపై అవినాష్ పడ్డాడు. అవినాష్  కారుపై పడగానే ఆయనను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స నిర్వహిస్తున్నారు. 
 

click me!