కర్నూల్ వైసీపీలో అధిపత్య పోరు: రాజీనామా యోచనలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్

By narsimha lodeFirst Published Mar 6, 2020, 10:44 AM IST
Highlights

కర్నూల్ జిల్లాలోని వైసీపీ నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి.  నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే  ఆర్ధర్‌కు వైసీపీ నేత ఆర్ధర్‌ కు మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరమీదికి వచ్చింది


నందికొట్కూరు: కర్నూల్ జిల్లాలోని వైసీపీ నేతల మధ్య విభేదాలు బట్టబయలయ్యాయి.  నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే  ఆర్ధర్‌కు వైసీపీ నేత ఆర్ధర్‌ కు మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరమీదికి వచ్చింది. బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి ప్రతిపాదించిన వారికే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించడంతో  ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గం భగ్గుమంది.

Also read:చంద్రబాబుకి పులివెందల ఫోబియా... విజయసాయి రెడ్డి సెటైర్లు

బైరెడ్డి సిద్దార్ద రెడ్డి వర్గానికి మార్కెట్ పాలకవర్గం దక్కడంతో   ఎమ్మెల్యే ఆర్ధర్  తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని సమాచారం. ఈ విషయమై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే ఆర్ధర్  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారని సమాచారం. 

శుక్రవారం నాడు ఉదయం ఎమ్మెల్యే ఆర్ధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడ ఆర్ధర్ రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

 నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవికి గండ్రెడ్డి ప్రతాప్ రెడ్డి పేరును ఎమ్మెల్యే ఆర్ధర్ పేరును ప్రతిపాదించారు.  కానీ ప్రతాప్ రెడ్డికి చైర్మెన్ పదవి దక్కలేదు. బైరెడ్డి సిద్దార్ధరెడ్డి ప్రతిపాదించిన వ్యక్తికి చైర్మెన్ పదవి దక్కింది.

ఇటీవలనే  జిల్లా ఇంచార్జీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ‌కు వ్యతిరేకంగా  ఆర్ధర్ వర్గీయులు  హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.  
 

click me!