చంద్రబాబుకి షాక్.. వైసీపీలోకి మరో నేత

First Published Jul 30, 2018, 4:29 PM IST
Highlights

 ఇప్ప టికే జగన్‌ను కలిసి తన నిర్ణయాన్ని తెలపగా పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. పిఠాపురం మండలం విరవ వద్ద జగన్‌ సమక్షంలో సోమవారం పార్టీలో చేరతానని చెప్పారు. 

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా.. మరో నేత టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో తగిన గుర్తింపు లభించలేదని.. అందుకే వైసీపీలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని  ఆదర్ష్‌ ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌, వాణిజ్యవేత్త బుర్రా అనుబాబు వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పిఠాపురం పట్టణంలోని పాతబస్టాండువద్ద గల ఫంక్షన్‌హాలులో ఆదివారం ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్ప టికే జగన్‌ను కలిసి తన నిర్ణయాన్ని తెలపగా పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. పిఠాపురం మండలం విరవ వద్ద జగన్‌ సమక్షంలో సోమవారం పార్టీలో చేరతానని చెప్పారు. తాను టిక్కెట్టు ఆశించి పార్టీలో చేరడంలేదని, సామాన్య కార్యకర్తగానే చేరుతున్నట్లు తెలిపారు.
 
సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామని ఇప్పటికే జగన్‌ చెప్పిన విషయాన్ని గర్తుచేశారు. తన తండ్రి బుర్రా శ్రీఆంజనేయకామరాజు టీడీపీలో ఉంటూ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేశారని, తాను ఇటీవల వరకూ టీడీపీలోనే ఉన్నానని తెలిపారు. టీడీపీలో గుర్తింపులేకపోవడంతో ఆ పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. జగన్‌ ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా కలసి పార్టీ విజయానికి పనిచేస్తామని తెలిపారు.

click me!