‘ఈసారి.. వైఎస్ కుటుంబంలో ఎవరు ఎవరిని చంపుతారోనని అనుమానం కలుగుతోంది’...ఆనం వెంకట రమణారెడ్డి

By SumaBala Bukka  |  First Published Jul 1, 2022, 8:39 AM IST

మళ్లీ ఎన్నికలొస్తున్నాయి.. ఈ సారి వైఎస్ కుటుంబంలో ఎవరిని ఎవరు చంపుతారో అంటూ టీడీపీ నేత ఆనం వెంకట  రమణారెడ్డి వ్యాఖ్యానించారు. 


నెల్లూరు : ‘ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి మరణించారు. ఆయన హత్య నిందను టిడిపిపై వేశారు. ఇప్పుడు   త్వరలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. వైఎస్ కుటుంబంలో ఈసారి ఎవరు.. ఎవరిని చంపుతారోనని అనుమానం కలుగుతోంది’ అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట  రమణారెడ్డి వ్యాఖ్యానించారు. వైయస్ విజయలక్ష్మి, వైయస్ షర్మిల,  ఆమె భర్త  బ్రదర్ అనిల్ కుమార్ లకు జెడ్ కేటగిరి భద్రత  కల్పించాలని..  కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆనం వెంకట రమణారెడ్డి  విజ్ఞప్తి చేశారు.  

నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఆనం వెంకటరమణారెడ్డి  విలేకరులతో మాట్లాడారు.  వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం ప్రమాదం కాదని హత్య అని..  రిలయన్స్ వాళ్లు.. ఈ హత్య చేశారంటూ ఆనాడు  జగన్ పత్రికలో రాశారు అని గుర్తు చేశారు. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత..  సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి మరణం మీద ఒక్క సిట్ ను కూడా  వేయలేదు  అన్నారు.  పైగా రిలయన్స్ అధినేత తన ఇంటికి వస్తే  చేతులు కట్టుకుని నిలబడ్డారు. అంతేకాకుండా ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఇచ్చారని విమర్శించారు.  

Latest Videos

undefined

వీటన్నింటిని బట్టి జగన్మోహన్ రెడ్డే.. వై ఎస్ ఆర్ ను హత్య చేయించారు అని అనుకోవాలా..  అని ప్రశ్నించారు. జగన్ పత్రికకు  పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో, ఆయన ఛానల్ కు  అనుమతులను కేంద్రం రద్దు చేసింది ఎందుకో.. వైసీపీ నేతలు  చెప్పాలని అన్నారు. ఆధాన్  డిస్టిలరీ కంపెనీని  2019, డిసెంబర్లో  స్థాపించారని, గడిచిన రెండేళ్లలో 50 శాతానికిపైగా మద్యం వ్యాపారాన్ని ఆ కంపెనీకి అప్పగించారని ఆరోపణలు చేశారు. ఇది జగన్  సూట్ కేస్  కంపెనీ అని  ఆనం వెంకటరమణారెడ్డి  ఆరోపించారు. 

వైఎస్ వివేకా హత్య కేసులో మిగిలిన సాక్షులనైనా కాపాడండి: ఎంపీ రఘురామకృష్ణంరాజు

కాగా, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య వెనుక భారీ కుట్ర కోణం ఉందని దాన్ని తేల్చే కీలక దిశగా దర్యాప్తు సాగుతోందని సీబీఐ న్యాయవాది మే13న హైకోర్టుకు తెలిపారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులకు తీవ్ర ముప్పు ఉందన్నారు. నిందితులకు బెయిల్ ఇవ్వరాదని సీబీఐతోపాటు వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది కోరారు. వివేకా హత్య కేసులో నిందితులు దేవిరెడ్డిశివ శంకర్ రెడ్డి (ఏ5), వై సునీల్ యాదవ్ (ఏ2), గజ్జల ఉమా శంకర్ రెడ్డి (ఏ3) బెయిల్ కోసం వేసిన వ్యాజ్యాలపై హైకోర్టు వేసవి సెలవుల ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మే 13న విచారణ జరిపారు. 

ఈ సందర్భంగా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐకి ఎంత సమయం పడుతుందో చెప్పాలని కోరారు. దర్యాప్తు కొనసాగింపు కారణంగా నిందితులను ఎక్కువకాలం జ్యుడీషియల్ కస్టడీలో ఉంచలేమని అన్నారు.  దిగువ కోర్టుల్లో రెండు అభియోగపత్రం ఛార్జిషీట్ విశాఖ జరిగిన దర్యాప్తు పురోగతిపై వివరాలు సమర్పించాలని స్పష్టం చేశారు. 

click me!