సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీని మోసం చేసే యత్నం.. చివరకు..!

Published : Jun 30, 2022, 05:57 PM IST
సీఎం జగన్ పీఏ పేరుతో మణిపాల్ ఆస్పత్రి ఎండీని మోసం చేసే యత్నం.. చివరకు..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఏ పేరుతో మోసానికి యత్నించాడు ఓ వ్యక్తి. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి ఎండీకి కాల్ చేయడమే కాకుండా.. ఫేక్ మెసేజ్ పంపాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఏ పేరుతో మోసానికి యత్నించాడు ఓ వ్యక్తి. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి ఎండీకి కాల్ చేయడమే కాకుండా.. ఫేక్ మెసేజ్ పంపాడు. ఓ క్రికెటర్‌కి ఇంటర్నేషనల్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ కిట్లు స్పాన్సర్‌ చేయాలని.. వాటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పాడు. కిట్‌పై మణిపాల్‌ చిహ్నాన్ని వాడుకుంటామని తెలిపాడు. తాను సీఎం పీఏ అని చెప్పుకున్నాడు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చిన మణిపాల్ ఆస్పత్రి ఎండీ.. ఆ మెసేజ్‌ ఎంతవరకు వాస్తవమో పరిశీలించాలని తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రి అసోసియేట్‌ డైరెక్టర్‌ జక్కిరెడ్డి రామాంజనేయరెడ్డికి సూచించారు. 

ఈ క్రమంలోనే అది ఫేక్ మెసేజ్ అని తెలియడం మణిపాల్ ఆస్పత్రి యజమాన్యం పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గుర్తు తెలియని ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మొబైల్ నెంబర్, ఇతర సాంకేతికత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు పాత నేరస్తుడేనని పోలీసులు గుర్తించారు. గతంలో కూడా అతడు పలువురిని మోసం చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

dhulipalla narendra ఘనంగా ధూళిపాళ్ల కుమార్తె వివాహం హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎం లు | Asianet Telugu
కుప్పంలో మెగా జాబ్ మేళాలో పాల్గొన్న నారా భువనేశ్వరి| Asianet News Telugu