ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2015 నుండి నకిలీ ఓట్ల నమోదు గురించి సీఈసీకి వివరించినట్టుగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.
న్యూఢిల్లీ: దొంగ ఓట్ల నమోదులో పోటీ పెడితే చంద్రబాబే గెలుస్తారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు.సోమవారంనాడు సీఈసీతో వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు హయంలో ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకల గురించి ఫిర్యాదు చేశారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటర్ ప్రోఫైలింగ్ నేరమన్నారు. ఈసీ రూల్స్ ను చంద్రబాబు తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. ఒలంపిక్స్ లో దొంగ ఓట్లుంటే చంద్రబాబు విజేతగా నిలుస్తారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. సేవామిత్ర , మై టీడీపీ యాప్ నేరుతో సేకరించిన సమాచారాన్ని సీఈసీకి వివరించినట్టుగా ఆయన చెప్పారు. ఒక వ్యక్తికి ఒక దగ్గరే ఓటుండాలన్నారు.పారదర్శకంగా ఓటర్ల జాబితా ఉండాలన్నదే వైసీపీ విధానమన్నారు.
టీడీపీ నేతలు అభ్యంతరకర సమాచారాన్ని సేకరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.ఓటరుకు పొలిటికల్ ప్రిఫరెన్స్, పార్టీ చాయిస్ ఎందుకని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు హయంలో బోగస్ ఓట్లను ఎలా నమోదు చేశారో సీఈసీకి వివరించినట్టుగా ఆయన తెలిపారు.ఆధార్ కు ఓటర్ ఐడీ కార్డు లింక్ చేస్తున్నారన్నదే చంద్రబాబు బాధగా కన్పిస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు.
undefined
also read:15 లక్షల ఓట్ల గోల్ మాల్ పై హైలెవల్ కమిటీకి డిమాండ్: సీఈసీతో భేటీ తర్వాత బాబు
2015 నుండి చేరిన దొంగ ఓట్ల జాబితాను సీఈసీకి అందించినట్టుగా విజయసాయి రెడ్డి తెలిపారు.ఇంటి నెంబర్లు, పేర్లు, ఎలా మేనేజ్ చేశారో ఆధారాలతో సహా సీఈసీకి అందించినట్టుగా విజయసాయి రెడ్డి చెప్పారు. పారదర్శకంగా ఓటర్ల జాబితా ఉండాలన్నదే వైసీపీ విధానమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో వైసీపీకి చెందిన ఓట్ల తొలగింపు ఎలా జరిగిందో కూడ సీఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా విజయసాయిరెడ్డి వివరించారు. ఓటరు కులం గురించి ఎవరైనా అడుగుతారా అని ఆయన ప్రశ్నించారు.