అఖిల కేంద్రంగా అంతః కలహాలు

Published : Jul 29, 2017, 07:56 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
అఖిల కేంద్రంగా అంతః కలహాలు

సారాంశం

మొదటినుండి మంత్రి భూమా అఖిలప్రియకు, సీనియర్ మంత్రి, ఉపముఖ్యమంత్రైన కెఇ కృష్ణమూర్తికి పడదు. అదేవిధంగా, జిల్లాలోని పలువురు ఎంఎల్ఏతో కూడా అఖిల దూరంగానే ఉంటున్నారు. దానికితోడు ఎన్నికల్లో కీలక నేత అయిన ఏవి సుబ్బారెడ్డితో విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయట. ఇవన్నీ అభ్యర్ధి విజయావకాశాలపై ప్రభావం చూపేవే.

నంద్యాల తెలుగుదేశంపార్టీ నేతల్లో అఖిలప్రియ కేంద్రబిందువుగా అంతః కలహాలు పెరిగిపోతున్నాయ్. అందుకు మంత్రి అఖిలప్రియకు  ఇతర నేతల మధ్య పెరిగిపోతున్న విభేదాలే కారణాలుగా  చెప్పుకోవచ్చు. దాంతో భూమాబ్రహ్మానందరెడ్డి గెలుపుకు నిజంగా కఫ్టపడుతున్నదెవరో చెప్పటం కష్టంగా మారింది. మొదటినుండి మంత్రి భూమా అఖిలప్రియకు, సీనియర్ మంత్రి, ఉపముఖ్యమంత్రైన కెఇ కృష్ణమూర్తికి పడదు. అదేవిధంగా, జిల్లాలోని పలువురు ఎంఎల్ఏతో కూడా అఖిల దూరంగానే ఉంటున్నారు. దానికితోడు ఎన్నికల్లో కీలక నేత అయిన ఏవి సుబ్బారెడ్డితో విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయట. ఇవన్నీ అభ్యర్ధి విజయావకాశాలపై ప్రభావం చూపేవే.

చంద్రబాబునాయుడుతో కొత్తగా కలిసిన లైన్ వల్ల మంత్రిని ఎన్నికల్లో యాక్టివ్ పార్ట్ తీసుకోకుండా ఏవి నియంత్రించ గలిగారు. అఖిలను కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం చేసేసారు. దానికితోడు అఖిల అనుభవరాహిత్యం, మరీ చిన్నపిల్లవటం, నంద్యాలలో పెద్దగా పట్టులేకపోవటం లాంటి అనేక అంశాలు ఏవికి బాగా కలిసి వచ్చాయి. దాంతో వచ్చిన అవకాశాలను ఏవి బాగా ఉపయోగించుకుంటున్నారు. అఖిల-ఏవి మధ్య ఆస్తులకు సంబంధించిన వివాదాలు కూడా తారస్ధాయికి చేరుకున్నట్లు ప్రచారం బాగా జరుగుతోంది.

ప్రచారానికి వస్తున్న ఎవరైనా సరే ఏవి చెప్పినట్లే నడుచుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలతో చంద్రబాబు కూడా ఎన్నికల నిర్వహణ బాధ్యత ఏవి మీదనే పెట్టడంతో సుబ్బారెడ్డికి తిరుగులేకుండా ఉంది. సరే, ఇదంతా ఎంతకాలమంటే చెప్పటం కష్టం. వాడుకుని వదిలేయటంలో చంద్రబాబుకు ఘనమైన రికార్డే ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. రేపు ఏవి పరిస్ధితి అయినా అంతే. కాకపోతే ఎంతకాలమన్నదే తేలాలి. ఆ విషయం ఏవికి కూడా బాగా తెలుసు. కాబట్టే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పద్దతిలో వ్యవహరిస్తున్నారు.

మంత్రి అయిన దగ్గర నుండి అఖిల వ్యవహారశైలి కూడా అదే విధంగా ఉంది. ఎవ్వరినీ కలుపుకుని వెళ్ళటం లేదు. కెఇ తదితరులు చేస్తున్న ప్రచారం కూడా మొక్కుబడిగా ఉందనే ఆరోపణలు వినబడుతున్నాయ్. అభ్యర్ధి గెలుపుకు ఎవ్వరు కూడా మనస్పూర్తిగా పనిచేయటం లేదనే ప్రచారం ఊపందుకుంది. దాంతో టిడిపిలో అయోమయం మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకుండా చాలా ముందునుండి ప్రచారాన్ని ఉదృతం చేయటమే బహుశా కారణం కావచ్చు. శనివారం నోటిఫికేషన్ వెస్తోంది. నిన్నటి వరకూ ఒక పద్దతి, ఈరోజు నుండి ఒక పద్దతి. దాంతో టిడిపిలోని అసలు సమస్యలు ఇపుడు బయటపడుతున్నాయ్. చూడాలి చంద్రబాబు అందరినీ ఏ విధంగా దారిలోకి తీసుకొస్తారో?

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్