తన తల్లిని కించపర్చిన వారిని ఎవరిని కూడా వదిలి పెట్టబోనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ హెచ్చరించారు. భవిష్యత్తులో ఎవరిని కూడా వదిలిపెట్టబోనని ఆయన చెప్పారు.
అమరావతి: తన తల్లిని కించపర్చిన వారిని ఎవరిని కూడా వదిలి పెట్టబోనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారుబుధవారం నాడు Nara lokesh మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా వైసీపీకి చెందిన కొందరు సభ్యులు నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకొన్నారు. ఈ విషయమై లోకేష్ తొలిసారిగా స్పందించారు. తన తల్లి గురించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు విని చాలా బాధపడ్డానని చెప్పారు.
also read:ఆ క్షమాపణలు అక్కర్లేదు: వైసీపి నేతల వ్యాఖ్యలపై నారా భువనేశ్వరి
ఈ వ్యాఖ్యల విషయంలో తన తండ్రి వారిని వదిలిపెట్టినా కూడా తాను మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. తన తల్లిపై వ్యాఖ్యలు చేసిన వారి తల్లి, చెల్లి, భార్యల గురించి ఇలానే మాట్లాడితే సహిస్తారా అని లోకేష్ ప్రశ్నించారు. అలాంటివారెవరినీ కూడా భవిష్యత్తులో వదిలి పెట్టనని ఆయన స్పష్టం చేశారు. సిగ్గుండాలి మీకు అంటూ ఆయన ఆవేశంతో ఊగిపోయారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని లోకేష్ సూచించారు. నీతి నిజాయితీతో పనిచేస్తున్న తన కుటుంబాన్ని బజారు కీడ్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. వరదలు వచ్చిన సమయంలోycp కి చెందిన ప్రజా ప్రతినిధులు ఏం చేశారని లోకేష్ ప్రశ్నించారు.ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే వైసీపీ ప్రజా ప్రతినిధులు పేకాట ఆడారని ఆయన ఆరోపించారు. rice అమ్ముకొన్నారని ఆయన విమర్శించారు.
గత మాసంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తన బార్య గురించి వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు చెప్పారు.ఈ విషయమై సభలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తనకు మైక్ ఇవ్వకుండా కట్ చేశారన్నారు. అయినా కూడా తాను సీఎంగా అయ్యాకే ఈ సభలో అడుగు పెడతానని చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకొన్నారు. అయితే సభలో చంద్రబాబు భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు ఎవరూ చేయలేదని ఏపీ సీఎం జగన్ సభలో ప్రకటించారు.
ఈ ఘటనపై ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో తాను మాట దొర్లినట్టుగా వంశీ మీడియా ఇంటర్వ్యూలో ప్రకటించారు. అయితే ఈ నెల 20న తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన భువనేశ్వరీ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడంపై ఆమె మాట్లాడారు. ఆ క్షమాపణలు తనకు వద్దన్నారు. మహిళలను కించపర్చే వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. ఈ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపై నందమూరి కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. బాలకృష్ణ సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు ఈ విషయమై ycp ప్రజా ప్రతినిధులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఈ తరహా వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలానే చేస్తే చూస్తూ ఊరుకోబోమని Balakrishna హెచ్చరించారు.