అమానుషం... ఆరేళ్ల చిన్నారిపై అరవయేళ్ల వృద్దుడు అత్యాచారం

Published : Oct 03, 2023, 07:45 AM ISTUpdated : Oct 03, 2023, 07:55 AM IST
అమానుషం... ఆరేళ్ల చిన్నారిపై అరవయేళ్ల వృద్దుడు అత్యాచారం

సారాంశం

మనవరాలి వయసు చిన్నారిపై ఓ అరవయేళ్ల వృద్దుడు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది. 

మైలవరం : అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది. మనవరాలి వయసు చిన్నారిపై ఏమాత్రం కనికరం చూపించకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు వృద్దుడు. 

వివరాల్లోకి వెళితే... ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు(60) సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. స్థానికంగా వుండే ఓ వైన్ షాప్ వద్ద రాత్రి కాపలాగా వుండే ఇతడి కన్ను ఓ ఆరేళ్ల చిన్నారిపై పడింది. వాడి దుర్భుద్ది తెలియని చిన్నారి తాతలా భావించి సరదాగా మాట్లాడేది. ఇదే అదునుగా చిన్నారికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అత్యాచారం అనంతరం చిన్నారి తీవ్ర నొప్పితో బాధపడుతూ ఇంటికి వెళ్లింది. కూతురు బాధను గమనించిన తల్లి ఏమయ్యిందని ఆరా తీసింది. అసలు తనపై అత్యాచారం జరిగిందని కూడా తెలియని ఆ చిన్నారి కోటేశ్వరరావు ఇంటికి తీసుకెళ్ళి ఎలా ప్రవర్తించాడో వివరించింది. కూతురు చెప్పింది విని ఆ తల్లి అవాక్కయ్యింది. 

Read More  దారుణం.. వివాహితను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారం.. పొలంలో పడేసి పరారీ..

వెంటనే కుటుంబసభ్యుల సాయంతో కూతుర్ని తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది బాధిత తల్లి. అత్యాచారానికి పాల్పడిన కోటేశ్వరరావుపై ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసారు. ఫోక్సో తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమాయక బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ వృద్దుడిని కఠినంగా శిక్షించాలని  గ్రామస్తులు కోరుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu