సింహచలం అప్పన్న ఆలయంలో ప్రమాణానికి సిద్దం:జగన్ కు లోకేష్ సవాల్

Published : Jan 01, 2021, 03:02 PM IST
సింహచలం అప్పన్న ఆలయంలో ప్రమాణానికి సిద్దం:జగన్ కు లోకేష్ సవాల్

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలు అబద్దమని  ప్రమాణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలు అబద్దమని  ప్రమాణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.

తన సవాల్ ను స్వీకరించాలని ఆయన జగన్ ను కోరారు.  జగన్ కు దమ్ముంటే సింహాచలం అలయానికి రావాలని ఆయన కోరారు.జగన్ పార్టీ ఫేక్.. హామీలన్నీ ఫేక్..పాలన కూడా ఫేక్ అని ఆయన విమర్శించారు.  తనపై వైసీపీ  చేసిన ఆరోపణలన్నీ పింక్ డైమండ్ విషయంలోనే తేలిపోయిందని ఆయన చెప్పారు.

 

విజయసాయిరెడ్డితో తనపై దొంగ ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన  మండిపడ్డారు.  ఈ మేరకు ట్విట్టర్ వేదికగా  ఆయన విమర్శలు గుప్్పించారు.

 

విజయనగరం జిల్లాలోని రామాలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసంలో చంద్రబాబు, లోకేష్ ల పాత్ర ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు.ఈ ఆరోపణలు చేసిన కొద్ది గంటలకే ట్విట్టర్ వేదికగా లోకేష్ ఈ సవాల్ విసిరారు.

PREV
click me!

Recommended Stories

22 AP Youth Rescued from Cyber-Slavery in Myanmar: కరెంటు షాక్ పెట్టేవాళ్ళు | Asianet News Telugu
IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం