సింహాచలం అప్పన్న సన్నిధిలో తేల్చుకుందామా?: విజయసాయికి లోకేష్ సవాల్

Arun Kumar P   | Asianet News
Published : Jan 01, 2021, 02:55 PM IST
సింహాచలం అప్పన్న సన్నిధిలో తేల్చుకుందామా?: విజయసాయికి లోకేష్ సవాల్

సారాంశం

 రాజకీయాల కోసమే టిడిపి అధ్యక్షులు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఈ పని చేయించారంటూ వైసిపి ఎంపీ విజయసాయి ఆరోపణలపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికన స్పందించారు.    

అమరావతి; ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లాలోని రామతీర్థ కోదండరామాలయంలో శ్రీరాముడి విగ్రహం తలను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. అయితే రాజకీయాల కోసమే టిడిపి అధ్యక్షులు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఈ పని చేయించారంటూ వైసిపి ఎంపీ విజయసాయి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికన స్పందించారు.

''ఏ1 క్రిమిన‌ల్ సీఎం..త‌న‌ డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగ‌రెడ్డితో దొంగ ఆరోప‌ణ‌లు చేయిస్తున్నాడు. నీ బ‌తుకు ఫేక్‌. నీ పార్టీ ఫేక్‌. నీ హామీలు ఫేక్‌. నీ పాల‌న ఫేక్‌. చివ‌రికి నాపై నీ దొంగ‌ల బ్యాచీతో చేయించే ఆరోప‌ణ‌లూ ఫేక్ అని పింక్ డైమండ్ తోనే తేలింది'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 

''ఎన్నాళ్లీ దొంగల‌తో దొంగ ఆరోప‌ణ‌లు జ‌గ‌న్‌ రెడ్డీ! సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధికి నువ్వే రా తేల్చుకుందాం.నువ్వు నా పై చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని ప్రమాణం చెయ్యడానికి నేను సిద్ధం.నువ్వు సిద్ధమా?'' అంటూ లోకేష్ సవాల్ విసిరారు. 

read more  దాన్ని వీడకుంటే.. ఆ దేవుడే జగన్ మదాన్ని అణగదొక్కుతారు: అచ్చెన్న హెచ్చరిక

ఇక ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా తనదైన స్టైల్లో విజయసాయికి కౌంటరిచ్చారు.''తలలు తియ్యాలన్నా, విగ్రహాలు ధ్వంసం చెయ్యాలన్నా అది జగన్ రెడ్డికే చెల్లింది సాయి రెడ్డి. జగన్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి అని నీ నోటి తో నువ్వే అంగీకరించినందుకు ధన్యవాదాలు. రామతీర్థం విగ్రహం ధ్వంసంతో పాటు, హిందువుల మనోభావాలు దెబ్బతీసుతున్న ప్రతీ కార్యక్రమం వెనుకా ఏ1,ఏ2 హస్తం ఉందని విగ్రహాల ధ్వంసం కేసులో వైకాపా  నాయకులు పట్టుబడినప్పుడే ప్రజలకు అర్థమైంది. ఇకనైనా నువ్వు కోతి వేషాలు ఆపి అధికారంలో ఉన్నది మీరే అన్న సోయ తెచ్చుకో సాయిరెడ్డి'' అంటూ ట్విట్టర్ వేదికన సంచలన విమర్శలు చేశారు అయ్యన్నపాత్రుడు.   
 
''43 వేల కోట్ల ప్రజాధనాన్ని  దోచుకున్న గజ దొంగలు వైఎస్ జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి అని సిబిఐ, ఈడి ఆధారాలతో సహా రుజువు చేసాయి. ఆస్తులు అటాచ్ చేసాయి.హవాలా మార్గంలో డబ్బు ప్రవాహం,సూట్ కేసు కంపెనీలు,క్విడ్ ప్రో కో తో పేదలకు చెందాల్సిన సొమ్ము దొబ్బి అవినీతి సామ్రాజ్య అధిపతి అయ్యాడు జగన్ రెడ్డి'' అంటూ విమర్శించారు. 
 
''అంతర్జాతీయ క్రిమినల్ గా పేరొందిన జగన్ రెడ్డి ఆఖరికి న్యాయ వ్యవస్థ పైనే బురద రాజకీయం మొదలెట్టాడు.16 నెలలు మాత్రమే చిప్పకూడు తిన్నారు. మరో 16 ఏళ్ళు చిప్పకూడు తినడానికి 2021 లోనే ముహూర్తం.సిద్ధంగా ఉండండి ఏ1,ఏ2'' అంటూ అయ్యన్న సంచలన ఆరోపణలు చేశారు.

 

PREV
click me!

Recommended Stories

AP Inter Results : కొద్దిసేపట్లో ఇంటర్ ఫలితాలు.. ఎక్కడ, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Minister Nara lokesh: అంగన్వాడీ ఆయా కొడుకు మాటలకు లోకేష్ ఫిదా | Asianet News Telugu