హొం మంత్రి సుచరితపై అనిత సీరియస్ కామెంట్స్

Published : Mar 01, 2021, 06:57 PM IST
హొం మంత్రి సుచరితపై  అనిత సీరియస్ కామెంట్స్

సారాంశం

ఏపీ హోంమంత్రి సుచరితపై టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని హోంమంత్రి సుచరితపై ఆమె మండిపడ్డారు. ఆ బొమ్మకు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా సీఎం జగన్ కీ ఇస్తేనే ఆడుతుందన్నారు.

అమరావతి:

 ఏపీ హోంమంత్రి సుచరితపై టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత  తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 
కీ ఇస్తే ఆడే ఒక బొమ్మ మాత్రమేనని హోంమంత్రి సుచరితపై ఆమె మండిపడ్డారు. ఆ బొమ్మకు సజ్జల రామకృష్ణారెడ్డి లేదా సీఎం జగన్ కీ ఇస్తేనే ఆడుతుందన్నారు.

 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగంలో ఒక్క ఆడపిల్లను కూడా కాపాడుకోలేని పరిస్థితి నెలకొందని అనిత వ్యాఖ్యానించారు. నరసరావుపేటకు చెందిన అనుషని హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. 

నిందితుడి పేరు పక్కన రెడ్డి అని ఉంటే చర్యలు తీసుకోవడానికి పోలీసులు భయపడుతున్నారని అనిత ఆరోపించారు. రెడ్డి అని పక్కన తోక ఉంటే రాష్ట్రంలో ఏ అరాచకమైనా చేయవచ్చా అంటూ ప్రశ్నించారు.జగన్ ప్రభుత్వంలో మహిళల మానాలు, ప్రాణాలు రెండూ పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని ఊదరగొట్టారని నరసరావుపేట అనూష కేసుపై జగన్ ఎందుకు స్పందించలేదని అనిత ప్రశ్నించారు

అనూష కేసులో 21 రోజుల్లో నిందితుడుకి శిక్ష పడితే సీఎం జగన్‌కు సలాం చేస్తామన్నారు. ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు కనీసం స్పందించడా అంటూ వంగలపూడి అనిత నిలదీశారు.
 

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?